
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో భారత యంగ్ బౌలర్ హర్షిత్ రాణా పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గౌతమ్ గంభీర్ కావాలనే హర్షిత్ రానాకు సపోర్ట్ చేస్తున్నారని చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆస్ట్రేలియా సిరీస్ కు హర్షిత్ రానా ను సెలెక్ట్ చేయడం పై విమర్శలు రాగా వాటిపై కోచ్ గంభీర్ స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం యూట్యూబ్ ఛానల్స్ వ్యూస్ కోసం 23 ఏళ్ల యంగ్ బౌలర్ పై ఇలా విమర్శలు చేయడం మంచిది కాదు అని.. అలా చేయకండి అని అన్నారు. ఈ హర్షిత్ రానా తండ్రి మాజీ చైర్మనో, మాజీ క్రికెటరో.. పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి అయితే కాదు. స్వయంగా కష్టపడి ఇక్కడ వరకు వచ్చిన అతడిపై కొంతమంది కావాలనే టార్గెట్ చేస్తుండడం మంచిది కాదు అని హెచ్చరించారు. భవిష్యత్తులో మీ పిల్లలను కూడా ఎవరో ఒకరు ఖచ్చితంగా టార్గెట్ చేయొచ్చని గుర్తుంచుకోండి అంటూ విమర్శలపై స్పందిస్తూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.
Read also : నాలుగు రోజులపాటు కోస్తాంధ్రలో భారీ వర్షాలు..!
కాగా కొద్ది రోజుల క్రితం వెటరన్ ప్లేయర్ అయినటువంటి కృష్ణమాచారి శ్రీకాంత్.. హర్షిత్ రాణాను ఆస్ట్రేలియా టూర్ కు ఎంపిక చేయడంపై తప్పు పట్టారు. హర్షిత్ రాణా టీమిండియాలో పర్మినెంట్ ప్లేయర్ అంటూ చెప్పుకోచ్చారు. ఎందుకంటే అతను గంభీర్ కు చాలా ఇష్టమైన వ్యక్తి కావడంతో ఇలా చేసి ఉంటారు అని.. అలాగే గిల్ తర్వాత అతని స్థానం రానాది అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇక 2027 వరల్డ్ కప్పు జట్టులో కూడా హర్షిత్ రాణా లాంటి ప్లేయర్లు ఉంటే ట్రోఫీకి గుడ్ బై చెప్పాల్సిందే అని తీవ్రంగా విమర్శించారు. ఇందులో భాగంగానే నేడు గౌతమ్ గంభీర్ ఇవి విమర్శలపై స్పందిస్తూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.
Read also : ఆస్ట్రేలియా సిరీస్ తోనే RO-KO అంటే ఏంటో నిరూపించుకోవాలి : మాజీ కోచ్