
హెచ్‌సీయూ, తెలంగాణ ప్రభుత్వం మధ్య వివాదానికి కారణమైన 400 ఎకరాల లెక్కేంటి..? ఆ భూములు ఎవరివి..? యూనివర్సిటీవేనా..? లేదా ప్రభుత్వానికికే చెందుతాయా…? యూనివర్సిటీ వాదన ఏంటి…? ప్రభుత్వం ఇస్తున్న క్లారిటీ ఏంటి…?
కంచ గచ్చిబౌలిలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పక్కనే ఉన్న 400 ఎకరాలపై ఇప్పుడు వివాదం నడుస్తోంది. ఆ భూమి విలువ సుమారు 30 నుంచి 40 కోట్ల రూపాయలు. ఆ భూమి తమదని… ప్రభుత్వం అక్రమంగా అక్రమించుకోవాలని చూస్తోంది యూనివర్సిటీ అధికారులు చెప్తున్నారు. విద్యార్థి సంఘాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలయిన బీఆర్‌ఎస్, బీజేపీ కూడా యూనివర్సిటీకి మద్దతు ఇస్తూ… కాంగ్రెస్ ప్రభుత్వ తీరును తప్పుబడుతున్నాయి. గత మూడు, నాలుగు రోజులుగా ఈ వివాదం నడుస్తోంది. యూనివర్సిటీ దగ్గర అయితే రణరంగమే జరుగుతోంది. 400 ఎకరాలను చదును చేసి స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం… జేసీబీలను పంపింది. యూనివర్సిటీ అధికారులు, విద్యార్థి సంఘాలు అడ్డుకోవడంతో… పోలీసులు భారీగా మోహరించారు. యూనివర్సిటీ చూట్టూ పోలీసు బలగాలే కనిపిస్తున్నాయి. 400 ఎకరాల అడవిని ధ్వంసం చేసి.. కాంక్రీట్ జంగిల్‌గా మార్చి కార్పొరేటర్లకు అమ్ముకునేందుకు రేవంత్‌రెడ్డి సర్కార్ కుట్ర పన్నుతోందన్న వాదన వినిపిస్తోంది. అయితే… ఇందులో నిజమెంత..?
Also Read : హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎంఐఎందేనా..? – పోటీకి ముందుకు రాని ప్రధాన పార్టీలు
హెచ్‌సీయూ వివాదంపై తెలంగాణ మంత్రులు… క్లారిటీ ఇచ్చారు. ఈ 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదే అని…. న్యాయపోరాటం చేసి సాధించుకున్నామని ప్రెస్‌మీట్ పెట్టి మరీ చెప్పారు. 2004లో కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలను సెంట్రల్ యూనివర్సిటీ అధికారులు… ప్రభుత్వానికి అప్పగించారని చెప్పారు. ఈ భూమిని అప్పగించినందుకు బదులుగా గోపనపల్లి సర్వే నంబర్లు 36, 37లో 397 ఎకరాలు తీసుకున్నారని చెప్పారు తెలంగాణ ప్రభుత్వం. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా విడుదల చేశారు. ఇప్పుడు… కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలు… తమవే అని యూనివర్సిటీ అధికారులు వాదించడం సరికాదన్నారు. ఇక… విద్యార్థులకు నష్టం జరిగే పనులను కాంగ్రెస్ చేయదని చెప్పారు తెలంగాణ మంత్రులు. రాజకీయ కుట్రలకు విద్యార్థులు బలికావొద్దని హితవు పలికారు.
Also Read : భూములు అమ్మితే ఒప్పుకోం.. రేవంత్ కు సీపీఐ ఝలక్
ఇంత వరకు బాగానే ఉంది… మరి, 400 ఎకరాలకు బదులు… గోపనపల్లిలో 397 ఎకరాలు ప్రభుత్వం ఇచ్చినట్టు చెప్తున్నారు. మరి ఇప్పుడు.. ఆ 397 ఎకరాలు యూనివర్సిటీ ఆధీనంలో ఉన్నాయా..? అన్నది చూడాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు సీఎం ఉన్న సమయంలో… ఒక ప్రైవేట్ కంపెనీకి HCU భూములు బదలాయించారన్న వాదన వినిపిస్తోంది. అప్పుడు విద్యార్థులు నిరనసన తెలిపితే గోపనపల్లిలో 397 ఎకరాలను ప్రత్యామ్నాయంగా కేటాయించారని. అయితే.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో గోపనపల్లిలోని ఆ 397 ఎకరాల్లో 200 ఎకరాలను టాటా ఇన్‌స్టిట్యూట్‌కి, మరో 100 ఎకరాలు నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌కి కేటాయించారట. ఇక… అందులో 90 ఎకరాలు తనవంటూ ఓ ప్రైవేట్ వ్యక్తి కోర్టును ఆశ్రయించారని చెప్తున్నారు. అక్కడ ఇప్పుడు.. ఒక రీసెర్చ్ ల్యాబ్ కూడా ఏర్పాటు చేశారట. 400 ఎకరాల భూమి విషయంలో టీజీఐఐసీ చేసిన ప్రకటన కూడా అబద్ధమని… హెచ్‌సీయూలో ప్రభుత్వం ఎలాంటి సర్వే చేయలేదని.. ఎలాంటి భూ బదలాయింపులకు వర్సిటీ ఒప్పుకోలేదని వైస్ రిజిస్ట్రార్ స్పష్టం చేస్తున్నారు. ఈ ఇద్దరిలో ఎవరి వాదన నిజం…? అన్నది తేలాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి …
-
మైం హోంలో బుల్డోజర్లు దింపు.. రేవంత్‌కు కవిత సవాల్
-
సొంతగడ్డలో కేసీఆర్ బిగ్ షాక్.. కాంగ్రెస్ లోకి దుబ్బాక ఎమ్మెల్యే జంప్?
-
రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవికి జానారెడ్డి చెక్! తెరవెనుక సీఎం రేవంత్ రెడ్డి?
-
ఇటు కేసీఆర్…అటు జగన్.. ప్రజలిచ్చిన తీర్పును గౌరవించడమా..? అవమానించడమా?
-
నల్గొండ జిల్లాలో మహిళ దారుణ హత్య… మద్యం మత్తులో భార్యను నరికి చంపిన భర్త!..