
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- సంక్రాంతి పండుగ అనగానే ప్రతి ఒక్కరికి కూడా కోడిపందాలు గుర్తుకు వస్తాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈసారి సంక్రాంతి పండుగ వాతావరణం చాలా అద్భుతంగా ముగిసింది. అయితే కనీ విరుగని స్థాయిలో ఈసారి బాగానే పండుగను జరిపారు. సంక్రాంతి అంటే కేవలం కోడిపందాలు మాత్రమే కాకుండా విభిన్న మైనటువంటి పోటీలు జరుగుతూ ఉంటాయి. తాజాగా అనంతపురం జిల్లా తాడిపత్రిలో పందులు ఫైట్ పోటీలు ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యానికి గురిచేసాయి. మరోవైపు కృష్ణాజిల్లా కూచిపూడి లో పొట్టేళ్ల పందాలు చాలా అటహాసంగా నిర్వహించారు. దీంతో వీటిని చూడడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడంతో పాటు… భారీ స్థాయిలో వీటిని వీక్షించడానికి ప్రజలు కూడా తరలివచ్చారు. ఈసారి ప్రతి పల్లెలో వినూత్నమైన పందేల కారణంగా సంక్రాంతి పండుగ ఉత్సాహం మరింత రెట్టింపు అయ్యింది. ఇదిలా ఉండగా పండుగకు సొంత గ్రామాలకు వచ్చినటువంటి ప్రజలందరూ కూడా తిరిగి మళ్లీ పట్టణాలకు పయనమవుతున్నారు. ఈ సందర్భంలోనే భారీగా ట్రాఫిక్ జామ్ కూడా ఆయా టోల్గేట్ ల వద్ద ఏర్పడుతుంది. పండుగ ముగియడంతో ప్రతి ఒక్కరు కూడా తిరిగి వారి గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. ఆయా సొంత గ్రామాలలో పండుగ వాతావరణన్ని ఇప్పటికీ కూడా గుర్తు చేసుకుంటూ జ్ఞాపకాలతో పట్టణాలలో జీవిస్తూ ముందుకు చదువుతున్నారు. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో కన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఈ సంక్రాంతి పండుగ చాలా ఉత్సాహంగా జరుపుతారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది.
Road Accidents: ఐదేండ్లలో 3.35 లక్షల మంది మృతి, టోల్ ప్లాజాల్లో ఇక నో నగదు చెల్లింపు!
Smartphone, TV Prices Hike: పెరగనున్న స్మార్ట్ ఫోన్లు, టీవీల ధరలు, కారణం ఏంటంటే?





