తెలంగాణ

నా బాధ ఏంటని ఒక్కసారైనా అడిగావా?.. సొంత అన్న పై విమర్శలు చేసిన కవిత!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రంలోని బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుందో తెలియట్లేదు. కేసిఆర్ తన సొంత కూతురు కవితనే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. నేడు కవిత తన సొంత అన్న కేటీఆర్ పై మండిపడుతూనే ప్రశ్నల వర్షం కురిపించారు. నాకు అన్యాయం జరుగుతుంది అని ఎన్నిసార్లు చెప్పినా కేటీఆర్ ఎందుకు స్పందించలేదని కవిత తీవ్రంగా ప్రశ్నించారు. నేను మీ చెల్లిని కదా.. పార్టీలో ముఖ్యమైన నేనే పార్టీ ఆఫీసులో కూర్చుని కొందరు నామీద కావాలనే కుట్రలు చేస్తున్నారని చెబితే… ఎందుకు పట్టించుకోలేదని అన్నారు. అసలు ఇదంతా కాదు.. ఎందుకు బాధ పడుతున్నావు చెల్లి అని ఒకసారైనా ఫోన్ చేసావా?.. ఇదే నా బంధం.. ఇదేనా మీరు ఇచ్చే గౌరవం?.. అని అన్నారు.

Read also : నేను చావలేదు.. సోషల్ మీడియాలో వచ్చిన రూమర్స్ అన్ని ఫేక్ : ట్రంప్

సరే కాసేపు రక్తసంబంధం పక్కన పెట్టండి… మీరు వర్కింగ్ ప్రెసిడెంట్, నేను ఎమ్మెల్సీ ని. సొంత పార్టీలో నాకు అన్యాయం జరుగుతుందని ఎన్నిసార్లు చెప్పినా కూడా పట్టించుకోలేదు. దాదాపు 103 రోజుల నుంచి కేటీఆర్ అన్న ఒక్క మాట కూడా మాట్లాడలేదు అని కవిత చెప్పుకొచ్చారు. కేసిఆర్ సొంత బిడ్డ అయినటువంటి నాకే ఇంతవరకు ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. అలాంటిది తెలంగాణ రాష్ట్రంలోని మిగతా మహిళల పరిస్థితి ఏంటి అని నిలదీశారు. ఏది ఏమైనా కూడా పార్టీ నుంచి నిష్క్రమించబడిన తర్వాత కవితా ప్రెస్ మీట్ పెట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తుంది. నేను దాదాపు 5 నెలల పాటు జైల్లో ఉండి బయటకు వచ్చిన తర్వాత అనేక ప్రజా సమస్యలపై పోరాటం చేశానని కవిత అన్నారు. బీసీల 42% రిజర్వేషన్లపై పోరాటం చేస్తుంటే నాపై దుష్ప్రచారం చేశారు.. ఇందులో నేను చేసిన తప్పేంటో బిఆర్ఎస్ పెద్దలు చెప్పాలని కవిత డిమాండ్ చేశారు.

Read also : సోషల్ మీడియాలో కొత్త నోట్ల నాణ్యత పై భారీ చర్చ! ఎందుకో తెలుసా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button