
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై తాజాగా బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నీ పాలనతో రాష్ట్రంలోని రైతులందరినీ కూడా అనగ తొక్కుతున్నావు అని రేవంత్ రెడ్డి పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత నెలకొంది అని.. ఈ పరిస్థితులకు కారణం కాంగ్రెస్ గవర్నమెంట్ కాదా?.. అని ప్రశ్నించారు. తాజాగా ఎరువుల కోసం రాష్ట్రంలోని పలు ప్రాంతాలలోని రైతులు క్యూ లైన్ లో నిలుచున్న వీడియోలను షేర్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని హరీష్ రావు తీవ్రంగా ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అవ్వడానికి ప్రతి ఒక్కరిని తొక్కుకుంటూ వచ్చాను అని గర్వంగా చెప్పుకునేటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు నీ చెత్త పాలనలో వ్యవసాయ రైతులను తొక్కుతున్నావు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also : మనుస్మృతి దహనం ఒక ఐక్యతకు నిదర్శనం : పెరుమాళ్ళ ప్రమోద్ కుమార్
వ్యవసాయంపై కనీస స్పష్టత లేని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే రైతుల బతుకులు ఇలానే క్యూ లైన్ లోనే తెల్లారాల్సి వస్తుంది అని తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుంచి కూడా ప్రజలు అన్ని రకాలుగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు అని.. ప్రతి ఒక్క రైతు కూడా ఈ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అని తెలిపారు. కాగా తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరతా ఏ స్థాయిలో ఉందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఆయా గ్రామాలలోని ప్రజలందరూ కూడా యూరియా కోసం క్యూ లైన్ లలో పగలు రాత్రి అనే తేడా లేకుండా కొన్ని గంటలపాటు లైన్లలో ఉండి యూరియా కోసం ఎదురుచూపులు కాస్తూ ఇబ్బందులు పడుతున్నారు. రైతుల సమస్యలపై ప్రతిపక్ష పార్టీలు ఎప్పటికప్పుడు అధికార పార్టీపై ప్రశ్నలు సంధిస్తూనే ఉంది.
Read also : రెండో రోజు మ్యాచ్ లో ఒక స్టార్ డక్ ఔట్, మరో స్టార్ విజృంభన!





