క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి హరీష్ రావుపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ కొనసాగుతోంది. సజ్జనార్ నేతృత్వంలో సిట్ అధికారుల బృందం ప్రశ్నోత్తరాల ప్రక్రియ చేపట్టింది. ట్యాపింగ్ కేసు నేపథ్యంలో ఈ విచారణకు ప్రాధాన్యం సంతరించుకుంది.
విచారణ సందర్భంగా హరీష్ రావు తరఫు న్యాయవాది రామచందర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ట్యాపింగ్ కేసుతో హరీష్ రావుకు ఏ విధమైన సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. గతంలో హరీష్ రావుపై నమోదు చేసిన కేసు కూడా తప్పుడు కేసేనని కోర్టులు తేల్చిన విషయాన్ని గుర్తు చేశారు.
ప్రస్తుతం జరుగుతున్న సిట్ విచారణలోనూ కొత్తగా తేలే అంశాలు ఏమీ ఉండవని, ఇది పూర్తిగా రాజకీయ కోణంలో సాగుతున్న వ్యవహారమని న్యాయవాది అభిప్రాయపడ్డారు. చట్టపరంగా తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని, విచారణను హరీష్ రావు సహకారంతో ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.
అటు సిట్ అధికారులు మాత్రం విచారణపై ఎలాంటి అధికారిక వ్యాఖ్యలు చేయకుండా, సాంకేతిక ఆధారాలు, పూర్వపు రికార్డులు, వాంగ్మూలాల ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఈ విచారణలో తదుపరి దశలో ఎవరి పేర్లు బయటకు వస్తాయన్నది





