తెలంగాణలో మహిళా పోలీసులకే రక్షణ లేకుండా పోయింది. వేధింపులు తట్టుకోలేక ఓ మహిళా ఏఎస్ఐ పోలీస్ స్టేషన్ లో ఆత్మహత్యా యత్నం చేసింది. ఈ ఘటన పోలీస్ వర్గాల్లో సంచలనంగా మారింది. ఎస్సై వేధిస్తున్నాడంటూ పోలీస్ స్టేషన్లోనే మహిళా ఏఎస్సై ఆత్మహత్యయత్నం చేసిన ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది.
మెదక్ – చిలిప్‌చేడ్ పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న ఎస్సై యాదగిరి వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఏఎస్సై సుధారాణి.విధులు సక్రమంగా నిర్వహిస్తున్నా విధులకు హాజరు కానట్లు కానిస్టేబుల్స్ తో అబ్సెంట్లు వేయిస్తున్నట్లు బోరున విలపించింది. కావాలని ఎస్సై యాదగిరి కక్షపూరితంగా దుర్భాషలడుతూ తనను మానసికంగా వేధిస్తున్నాడని పోలీస్ స్టేషన్లో ఆత్మహత్యాయత్నం చేసింది ఏఎస్సై సుధారాణి.చికిత్స కోసం ఏఎస్సై సుధారాణిని జోగిపేట ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.
Read More : లక్షలు తీసుకోకుండా నా భార్య ఇంటికి రాదు.. డీఈ భర్త షాకింగ్ విడియో
పోలీస్ స్టేషన్ లోనే ఏఎస్ఐ సూసైడ్ అటెంప్ట్ చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఎస్ఐ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఏఎస్ఐ ఆరోపణలపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నారని తెలుస్తోంది.