
క్రైమ్ మిర్రర్, మహాదేవ్ పూర్:- స్థానిక ఎన్నికల సందడి మొదలైన నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియ రసవత్తరంగా కొనసాగుతుంది. ప్రజలు పార్టీ బలపరిచిన అభ్యర్థుల కంటే స్వతంత్ర అభ్యర్థుల వైపే మొగ్గు చూపుతున్న క్రమంలో మహాదేవపూర్ మండల బీజేపీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న గుజ్జుల శంకర్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థిగా అంబట్ పల్లి గ్రామం నుండి బరిలో దిగనున్నట్లు సమాచారం. ఈ మేరకు బీజేపీ పార్టీ సభ్యత్వానికి మరియు ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నట్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. గ్రామాభివృద్దే ద్యేయంగా సర్పంచ్ బరిలో నిలువనున్న గుజ్జుల శంకర్ కు ప్రజల నుండి వచ్చే సానుకూలమైన అంశాలు గెలుపు దిశగా అడుగులు వేసేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి.
Read also : ఐ బొమ్మ రవికి బిగ్ షాక్.. మరో 14 రోజులు పాటు రిమాండ్!
Read also : బ్రేకింగ్ న్యూస్.. ఐపీఎల్ కు మూడో విధ్వంసకర ప్లేయర్ రిటైర్మెంట్!





