
-
శ్రీరాముని పాదం వేసిన పుణ్యభూమికి రిజర్వాయర్ ముప్పు
-
శివన్నగూడ రిజర్వాయర్ నిర్మాణంలో మునిగిపోతున్న ప్రాచీన దేవాలయ మార్గం
మర్రిగూడ, (క్రైమ్ మిర్రర్): మునుగోడు నియోజకవర్గంలోని పురాతన పుణ్యక్షేత్రం శివన్నగూడ శ్రీ నీలకంఠ రామస్వామి దేవస్థానం రక్షణకు నూతన శాశ్వత రోడ్డు మరియు బ్రిడ్జ్ నిర్మాణానికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హామీ ఇచ్చారు.
డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న శివన్నగూడ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఫలితంగా, దేవాలయానికి వెళ్లే ప్రస్తుత రహదారి మునిగిపోనుంది. ఈ విషయాన్ని దేవస్థానం చైర్మన్ రాపోలు యాదగిరి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా, రాజగోపాల్ రెడ్డి స్పందిస్తూ శివన్నగూడ పైలాన్ వద్ద ఆగి పరిస్థితిని స్వయంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, “పుణ్యక్షేత్రాల పరిరక్షణ మన బాధ్యత. శ్రీరాముని పాదం వేసిన పవిత్ర స్థలానికి శాశ్వత రహదారి, వంతెన నిర్మాణానికి అవసరమైన సహాయాన్ని అందిస్తాను,” అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం పాలకవర్గం సభ్యులతో పాటు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రామదాస్ శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ మేతరి యాదయ్య, చిట్యాల రంగారెడ్డి, ముడిగ నరసింహ యాదవ్, మోర నరసింహ ముదిరాజ్, అయితగోని వెంకటయ్య గౌడ్, గ్రామస్తులు ఇరుగదిండ్ల సత్తయ్య, పేరుమల చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.