
Aadhaar Enrollment: ఆధార్ కార్డు జారీ జారీ ప్రక్రియ ఇకపై మరింత కఠినతరం కానుంది. భారతీయులకు మాత్రమే ఆధార్ కార్డు అందించేలా ప్రభుత్వం నింబంధనలు మార్చబోతోంది. పౌరసత్వ రుజువు లేకుండా కేవలం గుర్తింపు కార్డుగా ఉన్న ఆధార్ వ్యవస్థలో వయోజనుల పేర్లు నమోదు కఠినతరం చేయనుంది. ఎవరైనా ఆధార్ కార్డు కోసం అప్లై చేసుకుంటే అందుబాటులో ఉన్న వారి వివరాలను ఆన్ లైన్ లో పొందుపర్చాలని వెల్లడించింది. పాస్ పోర్టు, రేషన్ కార్డు, బర్త్ సర్టిఫికేట్, 10వ తరగతి మార్క్స్ లిస్టును పరిశీలించనున్నారు. ఈ ప్రక్రియ కొత్తగా దరఖాస్తు చేసుకునే వారితో పాటు ఇప్పటికే కార్డులు ఉండి, వాటిలో మార్పులు, చేర్పులు చేసుకునే వారికి కూడా వర్తించనుంది. ఆధార్ కార్డును కేవలం భారతీయ పౌరులకు మాత్రమే అందించేలా మార్పులకు శ్రీకారం చుట్టనుంది.
వెరిషికేషన్ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే!
గత 15 ఏళ్లలో 140 కోట్లకు పైగా ఆధార్ కార్డులను జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. అప్పుడే పుట్టిన శిశువులకు కూడా ఆధార్ నంబర్‌ను జారీ చేస్తున్న నేపథ్యంలో.. కొత్తగా పేర్లు నమోదు చేసుకొనే వయోజనుల విషయంలో నిబంధనలను కఠినతరం చేయాలని కేంద్రం నిర్ణయించింది. దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వారు కూడా నకిలీ పత్రాలతో ఆధార్ కార్డులు పొందినట్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇకపై ఆధార్ జారీ ప్రక్రియను మరింత కఠినతరం చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇకపై ఆధార్ కార్డు వెరిఫికేషన్ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అప్పగించనుంది. రాష్ట్రాలకు చెందిన పోర్టల్ లో దరఖాస్తులను పూర్తిగా పరిశీలించిన తర్వాతనే ఆధార్ కార్డులను జారీ చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం కారణంగా దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వారికి ఆధార్ కార్డు పొందడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.