తెలంగాణ

ఎమ్మెల్సీలకు గవర్నర్ బ్రేక్? – రాజ్‌భవన్‌లో కదలని గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల ఫైల్‌

  • గవర్నర్ దగ్గర పెండింగ్ లో బీసీ రిజర్వేషన్స్ బిల్

  • గవర్నర్ ఆమోదముద్ర కోసం రేవంత్ సర్కార్ ఎదురుచూపులు

  • కోదండరాం, అజారుద్దీన్ కు తప్పని నిరీక్షణ

క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ : తెలంగాణలో గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల విషయం ఏమైంది…? ప్రొఫెసర్‌ కోదండరామ్‌, అజారుద్దీన్‌ను ఎంపిక చేసిన ప్రభుత్వం… గవర్నర్‌ అనుమతి కోసం పంపింది. ఆ ఫైల్‌ ఇంకా రాజ్‌భవన్‌లోనే పెండింగ్‌లో ఉంది. దీంతో… అనుమానాలు పెరుగుతున్నాయి. ప్రొఫెసర్‌ కోదండరామ్‌, అజారుద్దీన్‌ను గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా ఓకే చేసేందుకు.. ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా…? అందుకే గవర్నర్‌ పెండింగ్‌లో పెట్టారా…? అసలు ప్రభుత్వం ప్రతిపాదించిన ఇద్దరిని గవర్నర్‌ ఓకే చేస్తారా..? ఆ ఎమ్మెల్సీల ఫైల్‌పై రాజ్‌భవన్‌ స్టాంప్‌ పడుతుందా..? లేదా..?

Also Read : పండుగలు వస్తే చార్జీలు పెంచడమే.. ఇదేం ప్రభుత్వం : హరీష్ రావు

ఎమ్మెల్సీల ఫైల్‌ మాత్రమే కాదు… తెలంగాణలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన కీలకమైన బిల్లులు… గవర్నర్‌ దగ్గర పెండింగ్‌లోనే ఉన్నాయి. బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం చేసిన పంచాయతీరాజ్‌ చట్ట సవరణ బిల్లు, పురపాలక చట్ట సవరణ బిల్లులు అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదం పొందాయి. ఆ తర్వాత బిల్లులు గవర్నర్‌ ఆమోదం కోసం రాజ్‌భవన్‌కు చేరాయి. వీటితో పాటు సంగారెడ్డి జిల్లాలో కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు, ఇస్నాపూర్‌ మున్సిపాలిటీ విస్తరణ బిల్లు, ఆల్లోపతిక్‌ ప్రైవేట్‌ మెడికల్‌ కేర్‌ ఎస్టాబ్లిష్‌మెంట్ బిల్లు.. ఇలా మొత్తం ఐదు బిల్లులను గవర్నర్‌ ఆమోదం కోసం పంపింది ప్రభుత్వం. వీటిలో కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు, విస్తరణ బిల్లులకు రాజ్‌భవన్‌ ఆమోద ముద్ర వేసింది. మరి మిగిలిన వాటి సంగతి ఏంటి….? వాటికి గ్రీన్‌ సిగ్నల్‌ వస్తుందా..? లేదా అన్నదే ఇప్పుడు సస్పెన్ష్‌. ఆ బిల్లులకు ఆమోదం తెలిపే ముందు న్యాయసలహా తీసుకోవాలని గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ నిర్ణయించారు. దీంతో… బిల్లుల ఆమోదం ఆలస్యమవుతోందని సమాచారం.

Read Also : హైదరాబాద్‌ మెట్రో నుంచి L&T ఎందుకు తప్పుకుంటోంది..? – కారణం ఎవరు..?

గవర్నర్‌ దగ్గర పెండింగ్‌లో ఉన్న వాటిలో ముఖ్యమైంది.. గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల బిల్లు. ఇంతముందు… కాంగ్రెస్‌ ప్రభుత్వం గవర్నర్‌ కోటా కింద ప్రొఫెసర్‌ కోదండరామ్‌, జర్నలిస్ట్‌ అమీర్‌ అలీఖాన్‌ను ఎంపిక చేసింది. గవర్నర్‌ కూడా వారిని సిఫారసు చేశారు. అయితే.. బీఆర్‌ఎస్‌ నేతలు దాసోజు శ్రవణ్‌, కుర్ర సత్యనారాయణ దీనిపై న్యాయపోరాటం చేశారు. సుప్రీం వరకు వెళ్లారు. సుప్రీం కోర్టు… ప్రొఫెసర్‌ కోదండరామ్‌, జర్నలిస్ట్‌ అమీర్‌ అలీఖాన్‌ నియామకాన్ని రద్దు చేసింది. ఆ తర్వాత.. కాంగ్రెస్‌ ప్రభుత్వం… గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలుగా.. ప్రొఫెసర్‌ కోదండరామ్, అజారుద్దీన్‌ను ఎంపిక చేసింది. వీరి పేర్లను కేబినెట్‌లో ఆమోదం తెలిపి.. గవర్నర్‌ దగ్గరకు పంపింది. ఆ ఫైల్‌ గవర్నర్‌ దగ్గర పెండింగ్‌లోనే ఉంది. గతంలో మాదిరిగా న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకు గవర్నర్‌ జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు సమాచారం. గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎంపిక చేస్తున్న వారి గురించి.. ఒక నోట్‌ కూడా రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే.. ప్రక్రియ ఆలస్యం కావడంతో.. కాంగ్రెస్‌ వర్గాల్లో ఆతృత పెరుగుతోంది. ఎలాగైనా ప్రొఫెసర్‌ కోదండరామ్‌ను చట్టసభల్లోని పంపాలన్న పట్టుదలతో ఉంది కాంగ్రెస్‌ ప్రభుత్వం. అలాగే… అజారుద్దీన్‌కు కూడా ఎమ్మెల్సీ ఇచ్చి.. మైనార్టీ కోటాలో కేబినెట్‌లోకి తీసుకోవాలన్న ఆలోచన చేస్తోంది. ఇదంతా… ఎమ్మెల్సీలుగా వారి నియామకంపై రాజ్‌భవన్‌ ఆమోద ముద్ర పడితేనే సాధ్యమవుతుంది. అందుకే… ఎప్పుపెడప్పుడు రాజముద్ర పడుతుందా…? అని ప్రభుత్వం ఎదురుచూస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button