తెలంగాణ

యాదాద్రి థర్మల్ ప్లాంట్ అభివృద్ధికి ప్రభుత్వం శరవేగంగా చర్యలు

మిర్యాలగూడ,(క్రైమ్ మిర్రర్):-రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ అభివృద్ధికి గణనీయమైన పురోగతి కనిపిస్తోంది. విద్యుత్ ఉత్పత్తి రంగంలో కీలకంగా నిలిచిన ఈ ప్రాజెక్టు స్టేజ్-1 లోని 800 మెగావాట్ల సామర్థ్యం గల మొదటి యూనిట్‌ను రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తదితర ప్రజా ప్రతినిధులు కలిసి జాతికి అంకితమిచ్చారు.ఈ సందర్భంగా మంత్రుల బృందం మాట్లాడుతూ..డిసెంబర్ 2025 నాటికి అన్ని యూనిట్ల నిర్మాణ పనులను పూర్తి చేసి, వచ్చే జనవరి 2026 నుండి 4000 మెగావాట్ల పూర్తి సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.ప్లాంట్ పరిసర ప్రాంతాల అభివృద్ధిపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. విద్యుత్ ఉద్యోగుల కోసం పవర్ ప్లాంట్ ఆవరణలో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణానికి శంకుస్థాపన చేయబడింది.

Read also : నిద్ర లేవగానే ఫోన్ చూస్తున్నారా?.. అయితే ఇది మీకోసమే!

స్థానికుల కోసం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, ఆధునిక ఆసుపత్రులు, అంబులెన్స్ సేవలు ఏర్పాటు చేయాలని మంత్రులు వెల్లడించారు.ప్లాంట్ వల్ల ప్రభావితమైన రోడ్లను సిసిఅరొడ్లుగా అభివృద్ధి చేయడానికి రూ. 280 కోట్లు మంజూరు చేశారు. బొగ్గు, బూడిద లారీలు వెళ్లే మార్గాలను మెరుగుపరిచే పనులు కొనసాగుతున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. అవసరమైన అన్ని క్లియరెన్స్‌లు ఇప్పటికే పూర్తి అయ్యాయని, భూసేకరణ, నష్టపరిహారాల ప్రక్రియలను వేగంగా పూర్తిచేసి, రహదారి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని అధికారులను ఆదేశించినట్టు చెప్పారు.

Read also : నిద్ర లేవగానే ఫోన్ చూస్తున్నారా?.. అయితే ఇది మీకోసమే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button