ఆంధ్ర ప్రదేశ్క్రైమ్

మేకపోతుల బలి పట్ల ప్రభుత్వం ఆగ్రహం.. ప్రశ్నిస్తున్న వైసీపీ ఫ్యాన్స్?

క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకుల పుట్టినరోజు అయిన లేదా సినిమా విడుదలైన సందర్భంలోనైనా మేకపోతులను బలించి ఆ రక్తాలను పెక్సీల పై చల్లించడం ఒక ఫ్యాషన్ గా మారిపోయింది. ఒకప్పుడు సాంప్రదాయబద్ధంగా ఒక పూజ చేసి దేవుడు అండగా ఉండాలి అంటూ ఏదైనా పనిని ప్రారంభిస్తూ ఉంటాం. కానీ నేటి కాలంలో మాత్రం అవన్నీ పక్కన పెట్టేసి కేవలం మేకపోతులను బలించే తమ అభిమానాలను చాటుకుంటున్నారు. ఇక తాజాగా ఈనెల 21వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల కూడా మేకపోతులను బలి ఇచ్చారు. వాటి రక్తాన్ని జగన్ ఫ్లెక్సీ ల పై చల్లుతూ.. రప్ప రప్ప అంటూ యువకులు నినాదాలు కూడా చేశారు. అయితే ఈ మూగజీవాలను బలి ఇవ్వడం, యువకులలో నేర ప్రవృత్తిని పెంచేలా వైసీపీ నాయకులు యువకులను తయారు చేస్తున్నారు అని.. ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చాలా చోట్ల కార్యకర్తలను, అభిమానులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే మూగజీవాలను బలి ఇవ్వడం కూడా నేరమేనా అంటూ.. పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరోల సినిమా విడుదల అవుతున్న సందర్భంలో మూగజీవాలను బలి ఇవ్వడం లేదా?.. వారికో న్యాయం మాకో న్యాయమా?… వారు చేస్తే మంచి మేం చేస్తే చెడా?.. అంటూ వైసీపీ ఫ్యాన్స్ ప్రశ్నలు వేస్తూ విమర్శిస్తున్నారు. దీంతో రాజకీయంలో మరొక అంశంలో అధికారం మరియు ప్రతిపక్ష పార్టీ నాయకుల మధ్య వైరాలు, మాటల యుద్ధాలు మొదలవుతున్నాయి.

Read also : విజయ్ హజారే ట్రోఫీ.. ROKOకు శాలరీలు ఎంతో తెలుసా?

Read also : శివాజీ – అనసూయ మధ్య కోల్డ్ వార్.. మధ్యలోకి దూరిన ప్రకాష్ రాజ్?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button