
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు గూగుల్ అడుగుపెట్టిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసింది. ప్రతిష్టాత్మకమైనటువంటి టెక్ కంపెనీ గూగుల్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. మన రాష్ట్రంలోని విశాఖపట్నంలో గూగుల్ అడుగు పెట్టడం చాలా సంతోషంగా ఉందని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. గూగుల్ మన రాష్ట్రంలో అడుగు పెట్టడం అనేది నేడు మన రాష్ట్రానికి చారిత్రాత్మకమైన రోజు అని అభివర్ణించారు. అంతేకాకుండా ఇది గ్లోబల్ టెక్ మాప్ పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బలంగా నిలబెట్టి మైలురాయి అవుతుంది అని పేర్కొన్నారు. తాజాగా నేడు ఢిల్లీలో జరిగినటువంటి గూగుల్ తో ఒప్పంద కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… మన రాష్ట్రానికి గూగుల్ అడుగు పెట్టడం వెనుక చాలా ప్రయత్నాలు దాగి ఉన్నాయి అని అన్నారు. కేంద్రం సహకారంతో అలాగే మన విజనరీ లీడర్, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాయకత్వం వల్లనే ఇది సాధ్యమైందని అన్నారు. త్వరలో మన రాష్ట్రానికి మరిన్ని ప్రాజెక్టులు రాబోతున్నాయని… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డిజిటల్ హబ్ గా దేశానికి మంచి గుర్తింపు లభిస్తుంది అని చెప్పుకొచ్చారు. ఇవాళ జరిగినటువంటి ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తో పాటు కేంద్ర మంత్రులు నిర్మల సీతారామన్, అశ్వినీ వైష్ణవ్, లోకేష్ అలాగే గూగుల్ క్లౌడ్ సీఈఓ తామస్ కురియన్ పాల్గొన్నారు. దాదాపు 88,628 కోట్లతో ఒక గిగి వాట్ కెపాసిటీతో 2029 కల్లా విశాఖపట్నంలో డేటా సెంటర్ పూర్తి కి గూగుల్ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది అని అన్నారు. దీంతో రాష్ట్రంలో నిరుద్యోగులు కూడా తగ్గిపోతారని తెలిపారు. 2047 నాటికి కచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే నెంబర్-1 రాష్ట్రంగా ఉంటుంది అని మరోసారి స్పష్టం చేశారు.
Read also :23 ఏళ్ల పిల్లాడు అతడు.. వాడిపై విమర్శలు ఏంటి : గౌతమ్ గంభీర్
Read also : ఓటీటీ లో రికార్డు సృష్టించిన వార్ -2