
క్రైమ్ మిర్రర్, అంతర్జాతీయ న్యూస్ :- తాజాగా రష్యా తీరంలో దాదాపు 8.8 తీవ్రతతో భూకంపం సంభవించిన విషయం ప్రస్తుతం ప్రపంచమంతా కూడా మాట్లాడుకుంటుంది. ఇలాంటి సమయంలోనే యావత్ ప్రపంచ దేశాలు ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. కానీ భారతదేశంలోని ప్రజలకు ఎలాంటి ముప్పు లేదని ఒక గుడ్ న్యూస్ వచ్చింది. భారత సముద్రపు యొక్క భూభాగాలపై భూకంపం తీవ్రత లేదని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (INCOIS) తాజాగా ప్రకటించడం జరిగింది. దీంతో భారత దేశ ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇక మరోవైపు US లోని భారత పౌరులకు ఇండియన్ కాన్సలేట్ జనరల్ పలు హెచ్చరికలను కూడా జారీ చేసింది. యూఎస్ లోని తీర ప్రాంతాలకు చెందినటువంటి ప్రజలు తీరానికి దూరంగా ఉండాలని సూచించింది.
Also Read : 40 కోట్ల సబ్స్క్రైబర్లను దక్కించుకొని.. చరిత్ర సృష్టించిన Mr. Beast
కాగా రష్యా మరియు అమెరికా తీరాల్లో భారీ భూకంపం కారణంగా పసిఫిక్ సముద్రంలో సునామీ బీభత్సం సృష్టిస్తుంది. ఇప్పుడు దీని ప్రభావం దాదాపు 30 దేశాలపై పడడంతో అన్ని దేశాల ప్రజలు కూడా చాలా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కదా రష్యాలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యులు శాస్త్ర చికిత్స చేస్తున్నగా ఒకసారి భూకంపం సంభవించడంతో ఆసుపత్రి భవనం మొత్తం కూడా షేక్ అయింది. అయినా కూడా డాక్టర్లు బెదిరిపోకుండా బెడ్ పై ఉన్నటువంటి రోగికి ఆపరేషన్ చేసి మంచి మనసును చాటుకున్నారు. అయితే ఆ విజువల్స్ అన్నీ కూడా సీసీ కెమెరాలు రికార్డు అవ్వడంతో సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతుంది.