
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎవరైతే ప్రభుత్వ హాస్టళ్లు మరియు క్రీడా పాఠశాలల్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు ఉంటారో.. వారందరికీ కూడా చేపల కూర వడ్డించేందుకు ప్రభుత్వం ఇప్పటి నుంచే కసరత్తులు చేస్తోంది. ఈ విషయంపై ఉన్నతాధికారులతో మాట్లాడిన ప్రభుత్వ అధికారులు… సంక్రాంతి తర్వాత నుంచి దీనికి సంబంధించిన పథకం అమలులోకి రాబోతున్నట్లుగా సమాచారం. కాగా ఇప్పటికే ఈ చేపల కూర వడ్డించేందుకు మత్స్యశాఖ అధికారులు సుమారు 50 కోట్ల చేప పిల్లలను చెరువుల్లో వదిలి పెంచుతున్నారు. ఇక ఇవి పెరిగి బాగా ఉత్పత్తి అయ్యాయి అంటే వెంటనే విద్యార్థులకు పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలంగాణ సర్కార్ పూర్తి ప్రణాళికలను సిద్ధం చేసింది. దీంతో ఎవరైతే ప్రభుత్వ హాస్టల్లో చదువుకుంటున్నారో ఆ విద్యార్థులందరికీ కూడా సంక్రాంతి తర్వాత నుంచి చేపల కూర వడ్డించేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ పథకం వస్తే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆనందిస్తారు అని… సోషల్ మీడియా వేదికగా ఎంతో మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
Read also : ఎట్టకేలకు పెళ్లి డేట్ పై స్పందించిన రష్మిక
Read also : “స్క్రబ్ టైఫస్” లక్షణాలతో ముగ్గురు మరణం.. ఫిబ్రవరి వరకు జరభద్రం!





