క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసేందుకు తెలంగాణ లో ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచనలో పడింది. దీనిపై తాజాగా విద్య కమిషనరేట్ కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కాగా ఈ విషయంపై ఈ నెలలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలను సమర్పించనున్నట్లుగా సమాచారం అందింది.
నందిగాం సురేష్ కు బెయిల్ నిరాకరించిన కోర్టు!..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 424 జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఈ 424 జూనియర్ కళాశాలలో దాదాపుగా లక్షన్నరకు పైగా విద్యార్థులు చదువుతున్నారు. కాబట్టి జూనియర్ కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థులు అందరికి కూడా త్వరలోనే మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసే విధంగా ఆలోచిస్తున్నారు. ఈ మధ్యాహ్న భోజనం పథకం వల్ల దాదాపుగా అన్ని ప్రభుత్వ కాలేజీల్లో చదువుతున్నటువంటి పేద పిల్లలందరూ కూడా ఆహారానికి ఎటువంటి డోకా లేకుండా బాగా చదువుకోగలుగుతారు.
తెలంగాణ ప్రజలకు నాగార్జునసాగర్ జీవనాడి!..
ఇంతకుముందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జూనియర్ కాలేజీల్లో ఈ మధ్యన భోజన పథకం స్కీమ్ ను ప్రారంభించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు తెలంగాణలో కూడా ఇదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ మధ్యాహ్న భోజన పథకం స్కీమ్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు. ఈ మధ్యాహ్న భోజన పథకం కనుక రాష్ట్రంలో ప్రవేశపెడితే చాలామంది ప్రభుత్వ కాలేజీల్లో చదివే పేద విద్యార్థులు ఆహారానికి ఎటువంటి డోకా అనేది ఉండదు.