
దేశంలో డిజిటల్ చెల్లింపులు రోజురోజుకు రికార్డు స్థాయికి చేరుతున్నాయి. రోజుకు లక్షల కోట్ల రూపాయల యూపీఐ లావాదేవీలు జరుగుతుండగా, ప్రతి సెకనుకు లక్షల సంఖ్యలో ట్రాన్సాక్షన్లు నమోదవుతున్నాయి. ఈ డిజిటల్ విప్లవానికి ప్రధాన కారణంగా నిలిచిన ఫోన్‌పే ఇప్పుడు చెల్లింపులకే పరిమితం కాకుండా రుణాల పంపిణీ రంగంలోనూ కీలక అడుగు వేసింది.
బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, తక్కువ డాక్యుమెంటేషన్‌తో తక్షణ రుణాలు అందించేందుకు ఫోన్‌పే పలు బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. యాప్‌లోనే అర్హత పరిశీలన, దరఖాస్తు, ఆమోదం వంటి ప్రక్రియలు పూర్తయ్యేలా ఈ సౌకర్యాన్ని రూపొందించింది. దీంతో అత్యవసర అవసరాల్లో వినియోగదారులకు ఇది పెద్ద ఊరటగా మారుతోంది.
ఫోన్‌పే పర్సనల్ లోన్ ద్వారా వినియోగదారులు తమ క్రెడిట్ ప్రొఫైల్ ఆధారంగా రూ.10 వేల నుంచి గరిష్టంగా రూ.5 లక్షల వరకు రుణం పొందే అవకాశం ఉంది. ఇవి అన్‌సెక్యూర్డ్ లోన్లు కావడంతో బంగారం లేదా ఆస్తిని తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. లోన్ ఆమోదం పొందిన 72 గంటల్లోపు మొత్తం నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది.
ఈ రుణాన్ని తిరిగి చెల్లించేందుకు 12 నెలల నుంచి 60 నెలల వరకు గడువును ఎంపిక చేసుకోవచ్చు. వడ్డీ రేట్లు వార్షికంగా 11.30 శాతం నుంచి 35 శాతం వరకు ఉండే అవకాశం ఉంది. సిబిల్ స్కోర్ ఎంత మెరుగ్గా ఉంటే, అంత తక్కువ వడ్డీ రేటుకే లోన్ లభించే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
ఈ లోన్ పొందాలంటే దరఖాస్తుదారులు భారతీయ పౌరులై ఉండాలి. వయస్సు 21 నుంచి 60 ఏళ్ల మధ్య ఉండాలి. నెలవారీ ఆదాయం కనీసం రూ.15 వేలుగా ఉండటంతో పాటు సిబిల్ స్కోర్ 650 కంటే ఎక్కువగా ఉండాలి. అలాగే ఫోన్‌పే యాప్ యాక్టివ్‌గా ఉండటం తప్పనిసరి. ఆధార్, పాన్ కార్డులు, గత ఆరు నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్, శాలరీ పొందేవారికి పే స్లిప్ అవసరం ఉంటుంది.
ఫోన్‌పే యాప్‌లోనే లోన్‌కు సంబంధించిన అన్ని వివరాలను పారదర్శకంగా చూపిస్తోంది. ప్రాసెసింగ్ ఫీజు, నెలవారీ ఈఎంఐ, మొత్తం తిరిగి చెల్లించాల్సిన మొత్తం వంటి వివరాలు ముందుగానే తెలుసుకునే అవకాశం ఉంది. సకాలంలో ఈఎంఐలు చెల్లిస్తే క్రెడిట్ స్కోర్ మెరుగవుతుందని, భవిష్యత్తులో మరింత పెద్ద రుణాలు తక్కువ వడ్డీకే పొందే అవకాశాలు పెరుగుతాయని నిపుణులు సూచిస్తున్నారు. డిజిటల్ ఇండియా లక్ష్యానికి ఈ తరహా డిజిటల్ రుణాలు మరింత బలాన్ని ఇస్తున్నాయి.
ALSO READ: PM Kisan: వారికి డబ్బులు నిలిపివేత!





