భూమిలేని నిరుపేద కుటుంబాలకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే భూమిలేని నిరుపేద కుటుంబాలు నివసిస్తున్నాయో వారికి 12 వేల రూపాయలు ఇస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తాజాగా ప్రకటించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ హామీలు మెల్లమెల్లగా నెరవేరుస్తూ వస్తున్నారు. ఇక తాజాగా భూమి లేని నిరుపేద కుటుంబాలకు 12 వేల రూపాయలు ఇస్తామంటూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించారు.
మెగాస్టార్ ఇంటికి ఐకాన్ స్టార్… కారణమేంటి?
అయితే ఈ డబ్బులను మొత్తం ఒకేసారి ఇవ్వరట. ఏడాదిలో రెండు విడతలుగా ఈ 12 వేల రూపాయలను జమ చేస్తామని చెప్పుకొచ్చారు. మొదటి విడతగా డిసెంబర్ 28వ తారీఖున భూమిలేని నిరుపేద కుటుంబాలకు తొలి విడతగా అందిస్తామని అన్నారు. మరోపక్క రైతు భరోసా డబ్బులను కూడా సంక్రాంతి సమయంలో రైతులకు అందజేస్తామని తెలియజేశారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు రుణమాఫీ చేశామని చెప్పుకొచ్చారు.
అమెరికాకు కేసీఆర్.. అరెస్ట్ భయంతోనేనా?
తెలంగాణ రాష్ట్రంలో నష్టపరిహారం కింద ఎకరానికి 10000 రూపాయలు పరిహారం చెల్లించామని అంతేకాకుండా రైతు బీమా కూడా చెల్లిస్తున్నామని అన్నారు. “తెలంగాణ రాష్ట్రం అంటేకాంగ్రెస్ అని, కాంగ్రెస్ అంటేనే రైతు ప్రభుత్వం” అని బట్టి విక్రమార్క ఖమ్మంలోని మీడియా సమావేశంలో ఇదంతా చెప్పారు.