క్రీడలు

కోహ్లీ, రోహిత్ అభిమానులకు గుడ్ న్యూస్!…

క్రైమ్ మిర్రర్,స్పోర్ట్స్ న్యూస్:- రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీకి భారతదేశ క్రికెట్ చరిత్రలో ఎంతో పేరుతో పాటు ఎన్నో రికార్డులు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరికీ దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. రోహిత్ శర్మ కెప్టెన్సీ కి, విరాట్ కోహ్లీ ఆటకు చిన్నపిల్లల నుంచి పెద్దవారు వరకు కూడా వీరాభిమానులు ఉన్నారు. ఈ మధ్య విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ ఇద్దరూ కూడా టెస్ట్ ఫార్మాట్ కు అలాగే టి20 ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే రోహిత్ మరియు విరాట్ కోహ్లీ అభిమానులకు ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అది ఏంటంటే… వన్డేల నుంచి టీం ఇండియా స్టార్ ప్లేయర్స్ అయినటువంటి విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ ఇప్పట్లో రిటైర్మెంట్ తీసుకోరని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు.

Read also : అమిత్ షాతో డిబేట్ చేయను, జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!

దీన్నిబట్టి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మరికొద్ది రోజులపాటు ఓడి ఫార్మేట్ లో కొనసాగే అవకాశం ఉందని తెలుస్తుంది. వారిద్దరి రిటైర్మెంట్ కు అంత తొందర లేదని రాజీవ్ శుక్ల… కొంతమందికి అర్థమయ్యేలా చెప్పారు. ప్రస్తుతం కోహ్లీ చాలా ఫిట్నెస్ తో ఉన్నారని.. మరోవైపు రోహిత్ శర్మ కూడా చాలా బాగా రాణిస్తున్నారని చెప్పుకొచ్చారు. అలాంటప్పుడు క్రికెట్ లో.. ఆట తీరును చూస్తారు కానీ వయసును కాదని.. ఇలాంటప్పుడు వారు రిటైర్మెంట్ ప్రకటించాల్సినటువంటి అవసరం కూడా లేదు అని రాజీవ్ శుక్ల అన్నారు. విరాట్, రోహిత్ శర్మల రిటైర్మెంట్ పై చాలామంది లేనిపోని వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పుకొచ్చారు. వీళ్ళిద్దరూ కూడా కలిసి కొన్ని రోజులపాటు వన్డేలు ఆడుతారని… భారతదేశానికి మరిన్ని కప్పులు కూడా అందించే అవకాశం ఉందని రాజీవ్ శుక్ల క్లారిటీ ఇచ్చారు.

Read also: మా ఉత్పత్తులను కొనకండి, ట్రంప్ పై జై శంకర్ ఘాటు వ్యాఖ్యలు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button