
క్రైమ్ మిర్రర్, నల్గొండ బ్యూరో:- నల్లగొండ జిల్లాలో వానకాలం ధాన్యం కొనుగోళ్లకు సర్వం సిద్ధమైంది. జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు అట్టహాసంగా ప్రారంభమవుతున్నాయి. పిఎసిఎస్, సెర్ప్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి.
చెట్ల చెన్నారం ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
తాజాగా కనగల్లు మండల పరిధిలో సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఓపెన్ అవుతున్నాయి. అందులో భాగంగా చెట్ల చెన్నారంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పిఎసిఎస్ సీనియర్ ఇన్స్పెక్టర్ విజయ్ కృష్ణ, సీఈఓ ఎస్ రామచంద్రారెడ్డి ప్రారంభించారు. రైతులకు ఇబ్బందిగా లేకుండా నిర్ణీత తేమశాతం ఉన్నదాన్ని ఎప్పటికప్పుడు కొనుగోలు చేస్తామని వెల్లడించారు. సీరియల్ ప్రకారం రైతుల ధాన్యం కాంటాలు పెయిన్ ఉన్నట్లు వెల్లడించారు. వీలైనంత త్వరగా రైతుల ఖాతాల్లో దాన్ని డబ్బులు పడేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవ వేడుకలో పిఎసిఎస్ సిబ్బంది, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.
Read also : దెబ్బ అదుర్స్ కదా… సోషల్ మీడియాలో ట్రోలింగ్!
Read also : 14 న రాష్ట్ర బంద్ కు రాజకీయ పార్టీలన్నీ మద్దతు ఇవ్వాలి : బీసీ నేత