
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఎంతోమంది రైతుల వ్యవసాయ పంటలు నాశనమయ్యాయి. ఇక పంట కోతకు వచ్చి ధాన్యాన్ని బస్తాలకు పడుతున్న సమయాల్లో అకాల వర్షాలు వల్ల దాన్యం మొత్తం కూడా తడిసిపోయిన సందర్భాలు చాలా చూశాం. ఇప్పటికే చాలా మంది అధికారులు ఇటువంటి పంటలను పరిశీలించి ఆర్థిక సాయం చేస్తామని మాట ఇచ్చారు. అయితే తాజాగా రైతుల ధాన్యం తడిసిన కూడా కొనుగోలు చేయాలి అని మంత్రి దుర్గేష్ తెలిపారు. ధాన్యం తేమశాతం 17 దాటినా కూడా మానవతా దృక్పథంతో దాన్యం వెంటనే కొనుగోలు చేయాలి అని మిల్లర్లకు మంత్రి దుర్గేష్ సూచించారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా, చాగల్లు మండలం దొమ్మేరులో మంత్రి మనోహర్ అలాగే మంత్రి దుర్గేష్ ఇద్దరు కూడా దాన్యం సేకరణ తీరును పరిశీలించారు. ఇక ధాన్యం సేకరించిన వెంటనే రైతులు ఖాతాల్లో ఆలస్యం కాకుండా నగదు జమయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వర్షం వల్ల వంట నష్టం కలిగినా కూడా రైతులు ఎక్కడ నష్టపోకుండా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా మిల్లర్లకు సూచించారు. ఇకపోతే ఈసారి వర్షం వల్ల పంట నష్టం కలగకుండా ఉండే విధంగా రైతు సేవా కేంద్రాల ద్వారా ఉచితంగా టార్పా లిన్లు అందిస్తున్నామని మంత్రి మనోహర్ తెలిపారు.
Read also : సోషల్ మీడియా పై మలేషియా సంచలన నిర్ణయం!
Read also : ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు ఉచిత చికిత్స.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం!





