
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- తిరుమల వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు గుడ్ న్యూస్ తెలిపారు. తిరుమలలో నూతనంగా నిర్మించినటువంటి PAC -5 ( వెంకటాద్రి నిలయం) కాంప్లెక్స్ అందుబాటులోకి వచ్చింది అని సోషల్ మీడియా వేదిక ద్వారా వీడియోలు రిలీజ్ చేశారు. ఈ నూతన భవనానికి సంబంధించి వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ భవనం తిరుమలలో అతి పెద్ద వసతి సముదాయం అని పేర్కొన్నారు. ఈ భవనంలో మొత్తం గా 2500 మంది భక్తులు ఉండవచ్చు అని పేర్కొంది. దాదాపు 102 కోట్లతో ఈ కొత్త భవనాన్ని నిర్మించామని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. 5 అంతస్తుల ఈ భవనంలో డైనింగ్ హాల్స్, లాకర్స్, రెస్ట్ ఏరియాలు ఉంటాయని ఒక్కొక్కటిగా వివరించింది. ఇక ఈ భవనం ఆర్టిసి కాంప్లెక్స్ కు దగ్గరలోనే ఉంటుందని అధికారులు చెప్పుకొచ్చారు. దీంతో తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడానికి వచ్చేటువంటి భక్తులు ఈ విషయాన్ని గమనించాలని తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు సోషల్ మీడియాలో వీడియోలు విడుదల చేశారు. కాగా ప్రతి ఏడాది కూడా శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో నూతనంగా భవనాలను నిర్మిస్తున్నారు. దీని ద్వారా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలు కాస్త రెస్ట్ తీసుకుని స్వామివారిని దర్శించుకోవడానికి వీలుంటుంది. దీంతో దర్శనానికి వచ్చేటువంటి భక్తులకు ఇటువంటి సదుపాయాలు కల్పిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులకు
Read also : ఆశలు సమాధి అయ్యాయి…!
Read also : ఇది కదా ఇండియన్ పవర్ అంటే… విదేశాల్లో మన పర్యాటకుడికి గౌరవం