
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన “రాజసాబ్” సినిమా జనవరి 9న రిలీజ్ కాబోతుంది. ఇక అదే రోజున కోలీవుడ్ లో విజయ్ దళపతి నటించినటువంటి “జన నాయగన్” సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాలతో, సెన్సార్ సమస్యలతో విజయ్ దళపతి మూవీ వాయిదా పడినట్లు సమాచారం. ఒకవేళ అనుకున్నట్లుగానే విజయ్ దళపతి సినిమా వాయిదా పడితే కచ్చితంగా డార్లింగ్ ప్రభాస్ సినిమాకు ఇక కలెక్షన్ల వర్షం కురవాల్సిందే. విజయ్ సినిమా వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటన వస్తే వెంటనే తమిళనాడులోని అన్ని థియేటర్లు కూడా విజయ్ సినిమా బదులు ప్రభాస్ నటించిన రాజా సాబ్ సినిమాకు షోలు కేటాయిస్తారు. దీంతో సంక్రాంతి పండుగ వేళ టాలీవుడ్ లోనూ అలాగే కోలీవుడ్ లోనూ ప్రభాస్ కు భారీ కలెక్షన్లు వచ్చే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాజా సాబ్ మరియు జననాయగన్ ఈ రెండు సినిమాలు కూడా జనవరి 9వ తేదీన విడుదలవ్వాల్సి ఉండగా ఇప్పటికే సోషల్ మీడియా అంతటా కూడా విజయ్ సినిమా సెన్సార్ సమస్యలతో వాయిదా పడినట్లుగా సమాచారం ఉంది. దీంతో రేపు దేశవ్యాప్తంగా ప్రభాస్ సినిమానే థియేటర్లలో దద్దరిల్లుతాయి. ఇప్పటికే ప్రభాస్ ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నారు. దీంతో ప్రభాస్ సినిమాకు మొదటి రోజే భారీ కలెక్షన్లు వచ్చే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. జనవరి 9వ తేదీన దేశవ్యాప్తంగా పెద్ద హీరో ప్రభాస్ సినిమా మాత్రమే విడుదలవుతున్న సందర్భంగా డార్లింగ్ అభిమానులు కూడా తెగ సంతోషంలో మునిగిపోయారు. ఇప్పటికే అన్ని థియేటర్లలో కూడా భారీ ఎత్తులో ప్రభాస్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ సందడి చేస్తున్నారు.
Read also : ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి : రిటైర్డ్ డీజీపీ డాక్టర్ జితేందర్
Read also : వేములపల్లి: “నో హెల్మెట్ – నో పెట్రోల్” (No Helmet – No Petrol)





