
ఇప్పటి యువత, మధ్య వయసు వ్యక్తులు, పురుషులు సవాల్‌గా ఎదుర్కొంటున్న సమస్యల్లో ప్రధానం జుట్టు రాలడం. గతంలో బట్టతల సమస్యలు సాధారణంగా 50 ఏళ్లు దాటిన తరువాత మాత్రమే కనిపించేవి. కానీ ఇప్పుడు 20-25 ఏళ్ల లోపు యువతలోనూ, పురుషులలోనూ జుట్టు రాలిపోవడం వలన ఆందోళనలు తీవ్రంగా పెరిగాయి. యువత, యువకులు వయసుకు తగినంత జుట్టు లేకపోవడం వల్ల వ్యక్తిగత, సామాజిక జీవితం ప్రభావితమవుతోంది.
వైద్యులు, పరిశోధకుల విశ్లేషణ ప్రకారం.. జుట్టు రాలడం కోసం ముఖ్య కారణాలు మానసిక ఒత్తిడి, జీవనశైలి మార్పులు, కాలుష్యం, వాతావరణ మార్పులు. వాయు, జల కాలుష్యాల ప్రభావం చిన్న వయసులోనే బట్టతల సమస్యలకు దారితీస్తోంది. ఉద్యోగ జీవితంలో ఎల్లప్పుడూ ఒత్తిళ్లు ఎదుర్కొనే యువకులు, యువతల్లో జుట్టు రాలిపోవడం సాధారణం.
పురుషులకు జుట్టు మానవ సౌందర్యంలో ముఖ్యభాగం. నిండుగా జుట్టు ఉన్నవారిని చూడడం ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ జుట్టు రాలిపోవడం వల్ల యువత, పురుషులలో ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. వయసు మధ్య తరగతిలోనైనా జుట్టు సమస్య ఎదుర్కొనే వారు, పెళ్లి, వ్యక్తిగత సంబంధాలు, సామాజిక సంబంధాలపై ఆందోళన చెందుతున్నారు.
శాశ్వత పరిష్కారం దిశగా..
జుట్టు రాలడానికి ప్రధాన కారణం డైహైడ్రోటెస్టోస్టెరాన్ (DHT) హార్మోన్. ఇది జుట్టు కుదుళ్లను మృదువుగా, తద్వారా దెబ్బతీస్తుంది. కొత్తగా అభివృద్ధి చేసిన క్లాస్కో టెరోన్ 5% ద్రావణం దీన్ని నేరుగా తలపై పూస్తే ఆ ప్రాంతంలో DHT ప్రభావం ఆపబడుతుంది. క్లినికల్ ట్రయల్స్ ప్రకారం.. ఈ చికిత్స 539% వరకు కొత్త జట్టును పెంచింది. ముఖ్యంగా ఇది శరీరంలోని ఇతర హార్మోన్లను ప్రభావితం చేయకుండా, కేవలం సమస్య ఉన్న ప్రాంతంలోనే పనిచేస్తుంది.
క్లినికల్ ట్రయల్స్ వివరాలు..
1,400 మందిపై పురుషులతో రెండు క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు.
ప్లాసిబోతో పోలిస్తే 539% మెరుగైన ఫలితం (కొత్త జట్టు పెరుగుదల) నమోదైంది.
ఈ ఔషధం ఆమోదం పొందిన తర్వాత, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది పురుషులు జుట్టు సమస్యకు శాశ్వత పరిష్కారం పొందగలుగుతారు.
మార్కెట్‌లో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో వేచి చూడాల్సి ఉంది.
ALSO READ: BIG BREAKING: ఇక వైన్ షాపులు బంద్





