
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- కార్తీకమాసం మొదలుకొని నిన్న మొన్నటి వరకు కూడా అయ్యప్ప స్వామి మాలలు ధరించినటువంటి అయ్యప్ప స్వామి భక్తులందరూ కూడా శబరిమల ఆ అయ్యప్ప స్వామి వారి దర్శనం చేసుకున్నారు. ఇక దాదాపు రెండు నెలలుగా కొనసాగుతున్నటువంటి మండల మకరవిలక్కు ముగియడంతో శబరిమల ఆలయ అధికారులు ఆలయాన్ని మూసివేశారు. దీంతో ఈరోజు నుంచి కూడా స్వామివారి దర్శనం చేసుకోవడానికి వీలు లేకుండా పోయింది. అయితే తాజాగా అధికారులు మరో కీలక ప్రకటన చేశారు. శబరిమల ఆలయం మళ్లీ ఫిబ్రవరి నెలలో తెరుస్తారు అని గుడ్ న్యూస్ తెలిపారు. ఫిబ్రవరి నెలలో జరగబోయేటువంటి నెలవారి పూజల కోసం ఆలయాన్ని తిరిగి తెరవనున్నాము అని అధికారులు ప్రకటించారు. తాజాగా ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు తెలిపిన వివరాల ప్రకారం ఆలయాన్ని మళ్లీ ఫిబ్రవరి 12వ తేదీన సాయంత్రం 5 గంటలకు తెరవనన్నారు. ఇక అప్పటినుంచి ఫిబ్రవరి 17వ తేదీ రాత్రి 10:00 వరకు అయ్యప్ప స్వామికి పూజలు జరుగునున్నాయి. కాబట్టి అప్పటి వరకు కూడా భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకునే భాగ్యం ఉంటుంది. ఇక గతంలో మాదిరిగానే ఆన్లైన్ బుకింగ్ మరియు దర్శన టోకెన్లు కొనసాగనున్నాయి. కాబట్టి ఎవరైనా సరే శబరిమల అయ్యప్ప స్వామి వారిని దర్శించుకోవాలి అంటే తిరిగి మళ్లీ ఫిబ్రవరి నెలలోనే అది సాధ్యమవుతుంది.
Read also : Fake Certificate : పెద్దపల్లి జిల్లాలో నకిలీ స్టడీ సర్టిఫికెట్ల దందా..!
Read also : Donald Trump: యూరప్ లో ట్రంప్ కల్లోలం, ఫ్రాన్స్ కు 200% టారిఫ్స్ వార్నింగ్!





