
-
ఇక అవినీతి, అక్రమాలకు తావు లేదు
-
మధ్యవర్తులపై ఆధారపడటం అవసరం లేదు
-
టౌన్ ప్లానింగ్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం
హైదరాబాద్, క్రైమ్ మిర్రర్ : హైదరాబాద్‌లో ఇల్లు కట్టుకునే వారికి, అపార్ట్‌మెంట్ నిర్మాణ అనుమతులు కావాలనుకునే వారికి శుభవార్త. ఇకపై టౌన్ ప్లానింగ్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నగరంలో టౌన్ ప్లానింగ్ విభాగం 2026 మార్చి నుంచి ‘BuildNow’ అనే ఫుల్ ప్లెడ్జ్ డిజిటల్ అప్లికేషన్‌ను ప్రారంభించనుంది. BuildNow సాధారణ యాప్ కాదు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారంగా పనిచేసే అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించబడింది.
ఇల్లు లేదా అపార్ట్‌మెంట్ నిర్మాణానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేస్తే, AI టూల్స్ ఆటోమేటిక్‌గా అన్ని నిబంధనలను పరిశీలించి అనుమతుల ప్రక్రియను వేగంగా పూర్తి చేస్తాయి. మానవ జోక్యం తగ్గడం వల్ల జాప్యం, అవినీతి, అక్రమాలకు తావు లేకుండా వ్యవస్థను రూపొందించినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ కొత్త విధానం ద్వారా బిల్డింగ్ పర్మిషన్లలో పారదర్శకత పెరగడంతో పాటు, సాధారణ ప్రజలకు సమయం, ఖర్చు రెండూ ఆదా కానున్నాయి. ఇప్పటివరకు పర్మిషన్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరగడం, మధ్యవర్తులపై ఆధారపడటం వంటి సమస్యలకు చెక్ పడనుంది.
Read More : రాజగోపాల్ రెడ్డి సంకల్పం బలంగా నిలుస్తోంది…!
ప్రభుత్వ లక్ష్యం, స్మార్ట్ సిటీ భావనకు అనుగుణంగా డిజిటల్, పారదర్శక, వేగవంతమైన టౌన్ ప్లానింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయడం. మార్చి 2026 నుంచి అమల్లోకి రానున్న BuildNow అప్లికేషన్‌తో హైదరాబాద్‌లో గృహ నిర్మాణ రంగానికి కొత్త ఊపొచ్చే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.





