
క్రైమర్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :-
భారత స్టార్ బౌలర్ మహమ్మద్ షమిని బీసీసీఐ అంతర్జాతీయ క్రికెట్ లో పక్కన పెట్టేసింది. అతని స్థానంలో యువ బౌలర్లకు అవకాశాలు కల్పిస్తూ ఉంది. ప్రస్తుతం భారత జట్టులో బుమ్రా సీనియర్ ఫాస్ట్ బౌలర్ గా ఉండగా ఇక మిగతా అర్షదీప్ సింగ్, హర్షిత్ రానా, ప్రసిద్ధి కృష్ణ లాంటి బౌలర్లకు పెద్దగా అనుభవం లేదు. అయినా కూడా అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లలో వీరికి అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. మొన్నటి వరకు అంతర్జాతీయ క్రికెట్లో భారత జట్టు తరుపున మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్ లాంటి కీలక బౌలర్లు ఆడగా ప్రస్తుతం వారిద్దరిని కూడా పక్కన పెట్టేసింది. ఈ నేపథ్యంలోనే మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ మాట్లాడుతూ మహమ్మద్ షమీ లాంటి ప్లేయర్ను మళ్ళీ తిరిగి జట్టులోకి తీసుకోవాలని సూచించారు. డొమెస్టిక్ క్రికెట్లో మొహమ్మద్ షమీ అద్భుతంగా రాణిస్తున్న కూడా జాతీయ జట్టులోకి ఎందుకు తీసుకోవట్లేదు అని సెలెక్టర్లను హర్భజన్ సింగ్ ప్రశ్నించారు. మంచి మంచి బౌలర్లను ఎందుకు సైడ్ లైన్ చేసేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రసిద్ కృష్ణ మంచి బౌలర్ అయినప్పటికీ అతను నేర్చుకోవాల్సింది ఇంకా చాలానే ఉంది అని… వైట్ బాల్ క్రికెట్ లో ఎన్నో మ్యాచ్ లు గెలిపించిన బౌలర్లు ప్రస్తుతం జట్టులో లేరు అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాగా డొమెస్టిక్ లీగ్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మహమ్మద్ షమీ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్న నేపథ్యంలో హర్భజన్ క్షమికి మద్దతుగా నిలిచారు.
Read also : Family Bonding: మీకొక విషయం తెలుసా? అక్కాచెల్లెళ్లతో కలిసి పెరిగినవారు జీవితంలో తప్పక సక్సెస్ అవుతారట!
Read also : అఖండ -2 అప్డేట్ వచ్చేసింది… ఎందుకు ఆగిపోయిందంటే?





