
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- భారత జట్టు యువ ప్లేయర్ ఇషాన్ కిషన్ తాజాగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్ నిన్న జరగగా జార్ఖండ్ ఘన విజయం సాధించిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఈ ఫైనల్ మ్యాచ్ లో జార్ఖండ్ జట్టు తరఫున ఇషాన్ కిషన్ అతి తక్కువ బంతులలో సెంచరీ పూర్తి చేసి జట్టు విజయానికి కీలక పాత్ర పోషించారు. ఫైనల్ మ్యాచ్లో విజయం సాధించిన అనంతరం ఇషాన్ కిషన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
Read also : ప్రాణాలు తీస్తున్న గ్యాస్ గీజర్లు.. ఇవి ఎంత డేంజర్ అంటే?
భారత జట్టులో చోటు కోల్పోయినప్పుడు చాలా బాధనిపించింది అని కీలక వ్యాఖ్యలు చేశారు. చాలా బాగా పెర్ఫార్మ్ చేసిన కూడా నేషనల్ టీంకు నన్ను సెలెక్ట్ చేయలేదు అంటూ బాధపడ్డారు. అప్పుడే ఈ క్రికెట్ ఫార్మాట్లో ఇంకా బాగా రాణించాలి అని అర్థమైంది అంటూ.. నేను ఉన్న ప్రతి మ్యాచ్లో టీం ను గెలిపించాలి అని ఫిక్స్ అయ్యానంటూ వ్యాఖ్యానించారు. అయితే ప్రస్తుతం టీం లో పేరు లేదు అని బాధపడే జోన్ లో ప్రస్తుతం నేను లేను.. ఎక్స్పెక్టేషన్స్ లేకుండానే బాగా ఆడడమే నా పని అంటూ ఇషాన్ కిషన్ తెలిపారు. కాగా ఐపీఎల్ లో కూడా ముంబై తరఫున ఎన్నో మ్యాచ్లలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి పలుసార్లు టీమ్ ఇండియాకు కూడా ఆడడం జరిగింది. కానీ ఆ తరువాత పూర్తిగా ఇషాన్ కిషన్ డొమెస్టిక్ లేదా పలు లీగలకు మాత్రమే పరిమితమయ్యారు. నిన్న ఒక్కసారిగా విరుచుకుపడి ఆడడమే కాకుండా మ్యాచ్ ను గెలిపించి అందరి ప్రశంసలు పొందాడు.
Read also : Rape Case: అర్థరాత్రి యువతిని లాక్కెళ్లి అత్యాచారం.. ఆపై మరో ఘోరం





