
క్రైమ్ మిర్రర్, జగిత్యాల జిల్లా:- గొల్లపల్లి మండల కేంద్రంలో పారిశుధ్య నిర్వహణ పడకేసింది. గొల్లపల్లి నుండి గుంజపడుగు వెళ్లే రహదారిపై ఎక్కడ చూసినా చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయి. పారిశుధ్య సిబ్బంది నిర్లక్ష్యం వల్ల రోడ్ల పక్కన పేరుకుపోయిన ఈ చెత్తతో స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డుకు ఇరువైపులా చెత్త కుప్పలుగా పేరుకుపోవడంతో తీవ్రమైన దుర్వాసన వస్తోంది. దీంతో ప్రయాణికులు ముక్కు మూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
చెత్త వల్ల ఈగలు, దోమలు పెరిగి అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రహదారిపైకి చెత్త చేరడంతో వాహనాలు నడపడం ఇబ్బందిగా మారింది, ఇది ప్రమాదాలకు కూడా దారితీసే అవకాశం ఉంది. పారిశుధ్య నిర్వహణను పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత మండల అధికారులు స్పందించి, వెంటనే ఆ చెత్తను తొలగించి రోడ్డును శుభ్రం చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. రోడ్డు మీద చెత్త వేయడం వల్ల ప్రయాణం నరకంగా మారింది. వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.
Read also : గ్రామాలలో కొలువుదీరిన సర్పంచులు.. ఉప సర్పంచులు ప్రమాణ స్వీకారోత్సవ వేడుకలు
Read also : Doctor Patient Fight: ఆస్పత్రిలో డిష్యుం డిష్యుం, కొట్టుకున్న పేషంట్, డాక్టర్!





