
క్రైమ్ మిర్రర్, మహాదేవపూర్ ప్రతినిధి:-
తెలంగాణ యువత కోసం కాంగ్రెస్ సర్కార్ కొత్త పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. రాజీవ్ యువ వికాసం పేరుతో సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఈ కొత్త పథకాన్ని రూ.6 వేల కోట్లతో రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభం కాగా.. రాష్ట్రంలోని అర్హులైన యువకులకు ప్రభుత్వం రూ.4 లక్షల వరకు ఆర్థిక సాయం చేయనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన యువత ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 17వ తేదీ నుంచి ఏప్రిల్ 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల మంది నిరుద్యోగులు లబ్ధిపొందనున్నారు. ఇలాంటి సువర్ణ అవకాశాన్ని అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన యువత సద్వినియోగం చేసుకోవాలని సూరారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ యువ నాయకులు ఓడేటి లచ్చిరెడ్డి పిలుపునిచ్చారు.