
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- దేశంలో బంగారం ధరలు రోజురోజుకీ పెరిగిపోతూ ఉన్నాయి. బంగారానికి భారీ గిరాకీ ఉండడంతో ప్రస్తుతం చాలామంది కొనడానికి ఎక్కువ డబ్బులు పెట్టలేకపోతున్నారు. ప్రస్తుతం మూడు రోజుల్లోనే భారీగా బంగారం ధరలు పెరిగిపోయాయి. కేవలం మూడు రోజుల్లో 5670 రూపాయలు పెరిగింది. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా మార్కెట్లో బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోయాయి. దీంతో సామాన్య ప్రజలు బంగారాన్ని కొనుగోలు చేయాలంటేనే ఒకసారి ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు ఏకంగా 1850 రూపాయలు పెరిగింది. దీంతో 87,450 రూపాయలకు చేరింది. మరోవైపు 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 2020 రూపాయల పెరిగి 95,400 పలుకుతోంది.
ఇక మరో పక్క కేజీ వెండి ధర ₹1000 పెరిగి లక్ష ఎనిమిది వేలకు చేరుకుంది. దీంతో కేవలం మూడు రోజుల్లోనే తులం బంగారం ధర ఏకంగా 5670 రూపాయలు పెరిగింది. ఇక కేజీ వెండి పై 5000 రూపాయలు పెరగడంతో సామాన్య ప్రజలు బంగారం ధరలను కొనడానికి ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం వేసవి కాలం సీజన్ కాబట్టి ఎక్కువ సంఖ్యలో పెళ్లిళ్లు లేదా ఫంక్షన్లు జరుగుతుండడంతో బంగారం కొనుగోలు చేసే వారి సంఖ్య కూడా బాగానే పెరిగింది. దీంతో బంగారం ధరలు కొనాలంటేనే ఆస్తుల అమ్ముకోవాల్సి వస్తుందని చాలామంది భయపడుతున్నారు.