
gold price: దీపావళి తర్వాత బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు ఒక్కసారిగా కనిపించాయి. పండుగ ముగిసిన వెంటనే బంగారం ధరలు లక్షా 35 వేల వరకూ దూసుకుపోయినా, తరువాతి రోజుల్లో వరుస తగ్గుదలలు చోటుచేసుకున్నాయి. గత కొన్ని రోజుల్లో పసిడి రేట్లు ఎక్కడిక్కడికో మారుతూ పెట్టుబడిదారులను ఆందోళనకు గురి చేశాయి. ముఖ్యంగా నిన్న భారీగా పెరిగిన బంగారం ధరలు, ఈరోజు కొంత మేర తగ్గి ప్రజలకు స్వల్ప ఉపశమనం ఇచ్చాయి. బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల ఒక గ్రాము బంగారం రూ.80 తగ్గి 12,785 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల గ్రాము ధర రూ.70 తగ్గి 11,720 రూపాయలుగా నమోదైంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర 1,27,850గా ఉండగా, 22 క్యారెట్ల ధర 1,17,200 రూపాయలు. నిన్నటి ధరలతో పోల్చితే 24 క్యారెట్లపై 800 రూపాయలు, 22 క్యారెట్లపై 700 రూపాయల తగ్గుదల నమోదైంది.
హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,27,850 రూపాయల వద్ద కొనసాగుతుండగా, 22 క్యారెట్ల ధర 1,17,200గా ఉంది. విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో కూడా ఇదే రేట్లు కనిపిస్తున్నాయి. మరోవైపు వెండి ధరలు మాత్రం పూర్తిగా విరుద్ధ దారిలో సాగుతున్నాయి. వరుసగా ఐదో రోజు వెండి రేట్లు పెరగడం విశేషం. కిలో వెండిపై నిన్న ఏకంగా 11 వేల రూపాయల భారీ పెరుగుదల రావడం మార్కెట్‌ను కుదిపేసింది. నేడు మాత్రం స్వల్పంగా 100 రూపాయలు మాత్రమే పెరగడంతో ప్రస్తుత బులియన్ మార్కెట్‌లో వెండి కిలో ధర 1,73,100కు చేరుకుంది. హైదరాబాద్, విశాఖ, విజయవాడ ప్రాంతాల్లో అయితే కిలో వెండి 1,83,000 రూపాయలకు చేరి మరింత పెరిగిన స్థాయిలో కొనసాగుతోంది. పసిడి తగ్గినా, వెండి ఎగబాకడం పెట్టుబడి మార్కెట్‌లో కొత్త చర్చకు దారి తీసింది.
ALSO READ: ఓటీటీలో మూవీల వర్షం.. ఏకంగా 20 సినిమాలు





