
Gold- Silver Rates: బంగారం ధర రోజు రోజుకు మరింత పెరుగతోంది. భౌగోళిక రాజకీయ పరిస్థితులు, పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. డాలర్ తో పోల్చుకుంటే రూపాయి క్షీణిస్తుండడం కూడా బంగారం పెరుగుదలకు కారణం అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు (సెప్టెంబర్ 7న) 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1, 08, 490కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ. 99, 450కి చేరింది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర ఎంత అంటే?
ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ. 1, 08, 620కి చేరుకోగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 99, 600కి చేరుకుంది. ఇక హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1, 08, 490కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 99, 450కి చేరింది.
వెండి ధరల్లోనూ పెరుగుదల
వెండి ధరలు నిన్నటితో పోల్చుకుంటే కేజీకి వంద రూపాయల మేర తగ్గాయి. హైదరాబాద్, విజయవాడలో కేజీ బంగారం ధర రూ. 1, 38, 000కి చేరింది. ఢిల్లీ, కోల్ కతాలో రూ. 1, 28, 000గా పలుకుతోంది.