
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్ :- దర్శక ధీరుడు రాజమౌళి వారణాసి సినిమా ఈవెంట్ లో భాగంగా హిందూ దేవుళ్ళ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఆ ఈవెంట్ లో భాగంగా తనకు దేవుడిపై నమ్మకం లేదు అంటూ.. హనుమాన్ వెనక ఉండి నడిపించడం అంతా కూడా అబద్ధమే అంటూ రాజమౌళి వ్యాఖ్యానించడం పట్ల ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోయారు. ఆ తరువాత ఎంతోమంది రాజమౌళి పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తూ మండిపడ్డారు. ఇక తాజాగా రాజమౌళి చేసిన వ్యాఖ్యలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమౌళి చేసే ప్రతి సినిమాను కూడా హిందూ సమాజం బహిష్కరించాలి అని పిలుపునిచ్చారు. హిందూ దేవుళ్ళపై సినిమాలు చేస్తూ కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తున్న మీరు చివరికి ప్రమోషన్ కోసం ఇలాంటి కామెంట్స్ చేయడం దారుణమని అన్నారు. ఇలాంటి వ్యక్తులను వెంటనే జైల్లో వేయాలి అని.. లేదంటే మరిన్ని సందర్భాలలో దేవుళ్లపై అనుచుత వ్యాఖ్యలు చేస్తారు అని రాజాసింగ్ అన్నారు. దేవుడిపై నమ్మకం లేదు అంటూనే దేవుళ్ళ సినిమాలు తీస్తున్నాడు.. దేవుళ్ళ గురించి తప్పుగా మాట్లాడడం సమంజసం కాదు అని అన్నారు. వారణాసి ఈవెంట్ లో రాజమౌళి చేసిన వ్యాఖ్యల పై రెండు తెలుగు రాష్ట్రాల హిందువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం గ్లింప్స్ విడుదలకు కొన్ని టెక్నికల్ సమస్యలు వచ్చిన సందర్భంలో ఆ చిన్న సమస్యకు కూడా దేవుని అనడం ఏంటని హిందువులందరూ కూడా తీవ్రంగా మండిపడ్డారు. ఎన్నో సినిమాలను బ్లాక్ బస్టర్ చేసినటువంటి రాజమౌళి మొట్టమొదటిసారి ఇలా వివాదాల్లో చిక్కుకున్నారు. ఇకనుంచైనా దేవుళ్ళ గురించి ప్రస్తావించేటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడాలి అని రాజమౌళికి సూచిస్తున్నారు.
Read also : సినిమాల పైరసీ పట్ల సీఎం కీలక నిర్ణయం..!
Read also : Egg Prices: రికార్డులు బద్దలుకొట్టిన కోడిగుడ్డు ధరలు





