విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ సన్నిధిలో పోలీసులు చేసిన పనికి ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తూ మండిపడుతున్నారు. పోలీసులంటే వాళ్ళ బాధ్యతలు నిర్వహిస్తూ ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇటువంటి గొడవలు జరగకుండా చూసుకోవడమే వాళ్ళ పని. కానీ ప్రజలకు సేవలు చేయాల్సిన పోలీసులే పేకాట ఆడుకుంటూ ఎంతోమంది భక్తుల మీద నీరుజల్లారు.
విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో నవరాత్రులు సందర్భంగా ప్రతిరోజు కూడా అమ్మవారి కి ఎంతో ఘనంగా పూజలు నిర్వహిస్తూ భక్తిశ్రద్ధలతో ప్రజలు అమ్మవారిని చూడడానికి లక్షల్లో భక్తులు తరలివస్తున్నారు. స్వామివారి నవరాత్రుల్లో భాగంగా ఇప్పటికె మూడు రోజులు గడిచిపోయాయి. అయితే ఇటువంటి సమయాల్లో అమ్మవారిని చూడడానికి వచ్చేటువంటి భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అలాగే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకోవడమే పోలీసుల బాధ్యత. కానీ విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో పోలీసులు చేస్తున్న పనిని చూసి ప్రతి ఒక్కరు కూడా ఆందోళనకు గురవుతున్నారు. సోషల్ మీడియాలో ఆలయంలోని ఒక హోటల్ రూమ్ లో పోలీసులు పేకాటలు ఆడుతున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో ప్రతి ఒక్కరు కూడా సాక్షాత్తు ఆ అమ్మవారి గుడిలో విధులు నిర్వహించడానికి వచ్చిన సీఐలు పేకాట ఆడుతున్న దృశ్యాలు మరియు వీడియోలు తెగ హల్ చల్ అవుతున్నాయి. ఇందులో విజయవాడ టూ టౌన్ సిఐ కొండలరావు, పెనుగొండ సిఐ రాయుడు ఇంకా కొంతమంది సిఐలు పేకాట ఆడుతున్న దృశ్యాలు బయటపడడంతో ప్రజలందరూ కూడా అవాక్కవుతున్నారు. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేపడుతున్నారని ఇప్పటికే తొలి సమాచారం అందింది.
Read More : చంద్రబాబును టార్గెట్ చేసిన ఆశన్న హతం!
దేవుడు సన్నిధిలో పోలీస్ లు ఇలాంటి పనులు చేయడం వల్ల అది ప్రతి ఒక్క భక్తుడి మనోభావాలు దెబ్బతిన్నట్లేనని అక్కడికి వెళ్లేటువంటి భక్తులు కూడా చాలామంది పడుతున్నారు. ఒకపక్క సాక్షాత్తు శ్రీ కనకదుర్గ అమ్మవారిని చూడడానికి భక్తులు కొన్ని వేలల్లో తరలి వస్తుండడంతో భక్తుల రద్దీ అనేది ఎక్కువైపోతుంది. కానీ పోలీసులు ఏమాత్రం పట్టనట్టుగా రూమ్లలో పేకాట ఆడుకుంటూ సరదాగా గడుపుతున్నారు. ఇలాంటి పోలీసులను విధుల నుండి వెంటనే సస్పెండ్ చేయాలని అమ్మవారి భక్తులు అలాగే ప్రజలు ఉన్నతాధికారులకు తెలియజేస్తున్నారు. మరి కొంతమంది కామెంట్లు రూపంలో అమ్మవారి సన్నిధిలో ఇదేం దిక్కుమాలిన పనలు అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు.