
క్రైమ్ మిర్రర్,జాతీయ న్యూస్:- దక్షిణాది రాష్ట్రాల్లోని బీజేపీ ఎంపీలు అందరూ కూడా ప్రజల్లోకి వెళ్లి కేంద్ర సంక్షేమ మరియు అభివృద్ధి పథకాల గురించి పూర్తిస్థాయిలో వివరించాలి అని ప్రధానమంత్రి మోడీ పిలుపునిచ్చారు. బీజేపీ పార్టీ బలోపేతం కోసం చేపట్టాల్సిన చర్యలపై ఈరోజు దక్షిణాది బీజేపీ ఎంపీలతో ప్రత్యేక భేటీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై ప్రతి ఒక్క బీజేపీ నాయకుడు ప్రశ్నించాలి అని అన్నారు. మరీ ముఖ్యంగా వచ్చే ఏడాది కేరళ మరియు తమిళనాడు ఎన్నికలలో మన బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు సర్వశక్తుల ప్రయత్నాలు చేయాలని తెలిపారు.
Read also : ముగిసిన సర్పంచ్ ఎన్నికల పోలింగ్.. కాసేపట్లో కౌంటింగ్ షురూ..
ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలతో కలిసి పని చేయాలి అని.. అన్నారు. ఇక తెలంగాణలో బీజేపీ ఎంపీలు సరైన ప్రతిపక్ష పాత్ర పోషించలేకపోతున్నారు అని మోదీ తీవ్ర సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మీకంటే అసదుద్దీన్ సోషల్ మీడియా టీమే యాక్టివ్ గా ఉంది అని తెలిపారట. ప్రతి ఒక్క బీజేపీ ఎంపీ పనితీరు మారాలి అని.. ఇకపై సోషల్ మీడియాలో చురుగ్గా ఉండాలి అని బీజేపీ ఎంపీలకు సూచనలు చేశారు మోడీ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణల కూటమి ఎంపీలకు అల్పాహార విందులో మోడీ ఈ కామెంట్ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు పాలన చాలా అద్భుతంగా ఉంది అంటూ.. అందుకే పెట్టుబడులు కూడా భారీ స్థాయిలో వస్తున్నాయి అని మెచ్చుకున్నారు.
Read also : Shocking: వీర్య దానంతో 197 మందికి తండ్రి అయిన వ్యక్తి.. తర్వాత బయటపడ్డ సంచలన విషయం





