
క్రైమ్ మిర్రర్, కల్వకుర్తి:- తన భూమిని కొంతమంది నాయకులు కబ్జా చేశారని నా భూమిని నాకు ఇప్పించండి సారు అంటూ ఓ మహిళ వేడుకుంటుంది.
రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం, విఠాయిపల్లికి చెందిన హైమావతి పొలం కబ్జా జరిగిందని భూపోరాటం చేస్తున్నారు. సుమారు 5వందల మంది మద్దతుతో సోమవారం కొట్ర గేటు దగ్గర దివంగత కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.. అనంతరం ఆమె మాట్లాడుతూ.. తన భర్త వీరేశం 2006లో కల్వకుర్తి నియోజకవర్గం వెల్డoడ మండలం కుప్పగండ్లలో 10 ఎకరాల 6 గుంటల భూమిని కొనుగోలు చేశారు. 2020లో వీరేశం శబరిమలలో గుండెపోటుతో మృతి చెందారు. ఆ తర్వాత కొన్నాళ్ళకు తమ భూమి కుప్పగండ్ల రైతులు తమకు హద్దులు చూపించారని, అదే గ్రామానికి చెందిన కొందరు తమ భూమిపై కన్నేసి నాకు భర్త లేనందున నేను ఏమిచేయలేనని ధీమాతో తమభూమి కబ్జా చేస్తున్నారని హైమావతి ఆరోపించారు. తన భర్తకు రాజకీయ గురువు అయిన దివంగత నేత జైపాల్ రెడ్డి విగ్రహానికి వినతిపత్రం అందజేసి, ఆక్రమణ కోసం ప్రయత్నం చేస్తున్న వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకొని తమభూమి తమకు దక్కేలా చూడాలని బాధితురాలు కోరుతున్నారు. 10ఎకరాల 6 గుంటలకు సంబంధించిన భూపత్రాలు తమ వద్ద ఉన్నప్పటికీ అక్రమార్కులు తమ భూమిని కబ్జా చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. హైమావతి కి జరుగుతున్న అన్యాయానికి స్పందించిన నాయకులు న్యాయం జరిగేవరకు ఆమెవెంటే ఉండి అన్ని రాజకీయ పార్టీల మద్దతుతో పోరాటం చేస్తామని పేర్కొంటున్నారు.
Read also : సంజు సాంసన్ అవుట్… కొత్త కెప్టెన్ రేసులో యువ క్రికెటర్స్?
Read also : విదేశాలకు వెళ్ళిపోతున్న కొడుకులు.. ఒంటరిగా కుమిలిపోతున్న తల్లిదండ్రులు!





