
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ వెబ్ డేస్ : ఆడపిల్లలను కాపాడుకుంటే మన భవిష్యత్ తరాలకు ఎంతో మంచిగానే కృష్ణ యాదవ్ అన్నారు. మానుకోట మున్సిపాలిటీ పరిధిలోని 14వార్డుకు చెందిన భాషబోయిన సాయికుమార్, నందినిల కుమార్తె పేర రూ.10వేల ఫిక్స్ డ్ డిపాజిట్ చెక్కును చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి మనిషి తాను సంపాదించిన ఆదాయం లో కొంత భాగాన్ని సమాజ సేవ కోసం ఉపయోగించాలని కోరారు.
తన వంతుగా ఈ వార్డులో ఏ ఇంట్లో ఆడపిల్ల పుట్టినా తన వంతు సహాయం తప్పకుండా చేస్తానని, ఏ సమస్య వచ్చినా ఫౌండేషన్ దృష్టికి తీసుకువస్తే సత్వరమే స్పందిస్తానని తెలిపారు. సమస్యల పరిష్కారానికి భవిష్యత్తు లో సరైన నాయకున్ని ఎంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు బత్తుల మల్లేశం, గండ్రకోటి కుమార్, రేఖ చంద్రయ్య, పెరుగు పిచ్చయ్య, మంద నాగరాజు, బత్తుల కిరణ్, నందిపాటి రామాచారి, శ్రీను, చెన్నబోయిన యాకయ్య, శంకర్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.