
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- ప్రస్తుతం టీమిండియాలో యువ బ్యాట్స్మెన్ అలాగే వన్డే, టెస్ట్ కెప్టెన్ గిల్ పూర్తిగా విఫలం అవుతూ వస్తున్నారు. ఇక భారత్ మరియు సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన టి20 మ్యాచ్ లలో కూడా విఫలమవుతూ వస్తున్నారు. మరోవైపు జైశ్వాల్ అన్ని ఫార్మాట్లలో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తూ వస్తున్నారు. కానీ అవకాశాలు మాత్రం మెండుగా గిల్ కు లభిస్తున్నాయి. ఈ సందర్భంలోనే జైష్వాల్ అభిమానులు తారాస్థాయిలో మండిపడుతున్నారు. యశస్వి జైస్వాల్ తాజాగా జరిగిన టి20 లో చాలా అద్భుతంగా రాణిస్తున్నారు. మరి అలాంటప్పుడు నేషనల్ జట్టులోకి ఎందుకు తీసుకోవట్లేదు అని అభిమానుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Read also : కమ్మేస్తున్న పొగ మంచు.. ప్రధాని విదేశీ పర్యటన ఆలస్యం
గత నాలుగు మ్యాచ్ ల నుంచి గిల్ వరుసగా విఫలమవుతూ వస్తున్నారు. అయినా కూడా అతనికి మళ్ళీ మళ్ళీ ఎందుకు అవకాశాలు ఇస్తున్నారు అని అభిమానులు మండిపడుతూనే నేషనల్ టీంకు సెలెక్ట్ చేయాలి అని డిమాండ్లు వ్యక్తం చేస్తున్నారు. కాగా యశస్వి జైస్వాల్ గత 13 t20 ఇన్నింగ్స్ లలో అద్భుతమైన స్కోర్లను నమోదు చేశారు. వరుసగా అతని పరుగులు చూసుకుంటే 67, 6, 75, 51, 74, 49, 70*, 13, 34, 50, 36, 29,101 గా ఉన్నాయి. గత 13 ఇన్నింగ్స్ లలో ఐదు హాఫ్ సెంచరీలు ఒక సెంచరీ ఉండగా ఇలాంటి ప్లేయర్ ను ఎందుకు పక్కన పెడుతున్నారు అని జైస్వాల్ అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. టీమిండియాలో ఎవరైతే అద్భుతమైన ప్రదర్శనను కనబరుస్తారో వారికే చోటు దక్కాలి అని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Read also : TV Price Hike: వెంటనే టీవీలు కొనేయండి, లేదంటే జేబుకు చిల్లు పడటం ఖాయం!





