
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- భారత్ మరియు సౌత్ ఆఫ్రికా మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే త్వరలోనే సౌత్ ఆఫ్రికా తో ఓడి సిరీస్ కు ఇండియా నుంచి కెప్టెన్ ఎవరు అనేది ప్రస్తుతం ఆసక్తికర చర్చనీయాంశంగా మారిపోయింది. ఎందుకంటే ఇప్పటికే కెప్టెన్ గిల్ మరియు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయాల కారణంగా చికిత్స పొందుతూ ఉన్నారు. ఈ సందర్భంలో వారు వన్డే సిరీస్ ఆడడం చాలా కష్టమైన పని. అందుకనే మిగతా ప్లేయర్లలో ఒకరికి కెప్టెన్ పగ్గాలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. దీంతో కొత్త కెప్టెన్సీ రేసులో భారత జట్టుకు చెందిన కె.ఎల్ రాహుల్ మరియు అక్షర పటేల్ పేర్లు వినిపిస్తున్నాయి. ఎందుకంటే వీరిద్దరూ కూడా జట్టులో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఆటగాళ్లు. అలాగే గతంలో కొన్ని లీగ్ లకు కెప్టెన్సీలు కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే సౌత్ ఆఫ్రికా తో జరగబోయేటువంటి వన్డే సిరీస్లో భారత కెప్టెన్గా కేఎల్ రాహుల్ కు అవకాశాలు ఇవ్వాలని కొంతమంది కోరుతున్నారు. మరి కొంతమంది అక్షర పటేల్ కు అవకాశం ఇస్తే బాగుంటుంది అని కామెంట్లు చేస్తున్నారు. కాగా భారత్ మరియు సౌత్ ఆఫ్రికా మధ్య మొదటి వన్డే ఈ నెల 30వ తేదీన ప్రారంభం కానుంది. మరోవైపు సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ కూడా ఈ మ్యాచ్లలో ఆడే అవకాశాలు ఉన్నాయి. గిల్ అలాగే శ్రేయస్ వన్డే మ్యాచ్ కు అందుబాటులో లేకుంటే కచ్చితంగా వీరిద్దరిలోనే ఎవరో ఒకరు కెప్టెన్సీ అయ్యే అవకాశాలు ఉన్నాయని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి.
Read also : అన్నగా జగన్ అంటే అభిమానమే.. కానీ..?
Read also : క్షణికావేశంలో ఏ చిన్న తప్పు చేసిన జీవితాంతం కుమిలిపోతారు : సజ్జనార్





