
కాప్రా, క్రైమ్ మిర్రర్ : కాప్రా సర్కిల్ ఏ.ఎస్. రావు నగర్ డివిజన్ భవాని నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు ఏర్పాటుచేసిన ముఖాముఖి సమావేశానికి జి.హెచ్.ఎం.సి కమిషనర్ ఆర్.వి. కర్ణన్ హాజరయ్యారు. కమిషనర్ కాలనీ ప్రెసిడెంట్ వి.శేఖర్ జనరల్ సెక్రెటరీ శ్రీరాములు కాలనీకి సంబంధించి పరిష్కరించవలసిన సమస్యలపై జిహెచ్ఎంసి కమిషనర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ముఖ్యంగా వర్షాకాలంలో పై కాలనీ నుండి వచ్చే వర్షపు నీటి వలన ఎదుర్కొంటున్న ఇబ్బందులను, సమస్యను పరిష్కరించవలసిందిగా కోరారు.
కాలనీ సొంత ఖర్చుతో గుడిని నిర్మించుకోవడానికి కావలసిన స్థలాన్ని ఇప్పించవలసినదిగా, శానిటేషన్ సిబ్బందిని పెంచవలసిందిగా, శానిటేషన్ విభాగంలో ఖాళీలను వెంటనే భర్తీ చేయవలసినదిగా తెలియజేశారు. సమస్యలపై జిహెచ్ఎంసి కమిషనర్ స్పందిస్తూ సంబంధిత సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగేందర్ శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టవలసిందిగా ఆదేశించారు.
శానిటేషన్ సిబ్బంది విషయమై అడిషనల్ కమీషనర్ సానిటేషన్ రఘు ప్రసాద్ స్పందిస్తూ సిబ్బందిని పెంచే విషయమై అది ప్రభుత్వ పరిధిలో ఉన్నట్టు ప్రస్తుతము ఖాళీగా ఉన్న కారుణ్య నియామకాలు, లాంగ్ ఆబ్సెంట్ ఉన్న సిబ్బంది స్థానంలో రక్తసంబంధీకులను నియమించుటకు కావలసిన ఆదేశాలు ప్రభుత్వం నుండి వచ్చినందున త్వరలో నియామకాల విషయమై వాటిని భర్తీ చేయనున్నట్లు తెలియజేశారు.
ఈ సందర్భంగా జిహెచ్ఎంసి కమిషనర్ మాట్లాడుతూ కాలనీ వారి నుండి పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుపరచడానికి ఇంటింటి నుండి సోర్స్ సె గ్రిగేషన్ అనగా చెత్త జనరేట్ అవుతున్న ఇంటి నుండి వ్యాపార స్థలాల నుండి తడి చెత్త పొడి చెత్త వేరు చేసి మున్సిపల్ ఆటో వారికి ఇవ్వడం వలన పారిశుద్ధ్య నిర్వహణ సజావుగా జరగడమే కాకుండా జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ పై కూడా భారము తగ్గుతుందని వివరించారు. మనము ఎక్కువ రోజులు డంపింగ్ యార్డ్ ను వినియోగించుకోవడానికి అనుకూలంగా ఉంటుందని తెలియజేశారు. ఎవరు కూడా చెత్తను ఆరు బయట ప్రదేశాల్లో పడవేయకుండా మున్సిపల్ ఆటో వారికి మాత్రమే ఇవ్వడం వలన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవచ్చని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ జగన్,ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నాగేందర్, మెడికల్ ఆఫీసర్ మధుసూదన్ రావు, శానిటరీ సూపర్వైజర్ సుదర్శన్, జవాన్లు, ఎస్ ఎఫ్ ఏ లు హాజరయ్యారు. కాలనీ సీనియర్ కార్యవర్గ సభ్యులు అంజి రెడ్డి జిహెచ్ఎంసి కాప్రాసర్కిల్ సేవలు సక్రమంగా అందుతున్నట్టు తెలియజేస్తూ జిహెచ్ఎంసి సహకారం అన్నివేళలా కాలనీకి అందిస్తున్నారని, భవాని నగర్ ను మోడల్ కాలనీగా తీర్చిదిద్దుటకు కాలనీలో ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.