Thursday, March 12, 2026
Homeఅంతర్జాతీయంఏపీని తాకిన గ్యాస్ క‌ష్టాలు....! ఇక హోట‌ళ్ల‌కు వారాంత‌పు సెల‌వు

ఏపీని తాకిన గ్యాస్ క‌ష్టాలు….! ఇక హోట‌ళ్ల‌కు వారాంత‌పు సెల‌వు

  • ఇంధ‌న కొర‌త లేకుండా చ‌ర్య‌లు తీసుకోవాలి

  • స‌మీక్షా స‌మావేశంలో సీఎం చంద్ర‌బాబు

అమ‌రావ‌తి, క్రైమ్ మిర్ర‌ర్‌: ప‌శ్చిమా ఆసియా యుద్దం రోజు రోజుకు ఉద్రిత‌మ‌వుతుంది. ఇజ్రాయిల్‌, అమెరికా, ఇరాన్‌పై నిప్పుల వ‌ర్షం కురిపిస్తున్నారు. దీంతో చ‌మురు బారెళ్లు రాక గ్యాస్ కొర‌త దేశంలోని ప్ర‌తిరాష్టంలో, గ్యాస్ అధారిత రంగం పై తీవ్ర ప్ర‌భావం చూపుతున్నాయి. తాజా యుద్దం ఎఫెక్ట్‌తో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హోట‌ళ్ల‌కు వారంత‌పు సెల‌వు, ఆన్‌లైన్ డెలీవ‌ర‌ల బంద్‌కు కూట‌మి ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

ఈ సంద‌ర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో ప్రారంభమైన జిల్లా కలెక్టర్ల సమావేశంలో (ఎల్పీజీ) గ్యాస్ నిల్వలు, సరఫరా వ్యవస్థపై అధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలో ఇంధన కొరత ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ మేరకు ముగ్గురు మంత్రులతో కూడిన ప్రత్యేక కమిటీని చంద్రబాబు నియమించారు.

ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వంట గ్యాస్, నిత్యావసరాలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు గ్యాస్‌తో పాటుగా ఇతర నిల్వలపై పర్యవేక్షణ కోసం ముగ్గురు మంత్రలుతో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకిటించారు. ఈ కమిటీలో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఉన్నారు. రాష్ట్రంలో వంట గ్యాస్, నిత్యావసరాలకు కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారుల్ని చంద్రబాబు ఆదేశించారు.

రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు, ఆసుపత్రులకు గ్యాస్ ఇబ్బందులు రాకుండా చూడాలని. ఎలాంటి అంతరాయం లేకుండా ఎల్పీజీ సరఫరా చేయాలి అన్నారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో గ్యాస్‌కు కొరత లేదని అధికారులు కేంద్రంతోనూ మాట్లాడి ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు. ఒకవేళ ఇబ్బందులు ఎదురైతే వెంటనే పరిస్థితిని చక్కదిద్దేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఇదిలా ఉంటే కమర్షియల్గ్యాస్ తీవ్ర కొరతపై ఏపీ ఆంధ్రప్రదేశ్‌ హోటల్స్‌ అసోసియేషన్, స్టార్‌ హోటల్స్‌ అసోసియేషన్‌ ఆందోళన వ్యక్తం చేసింది. విజయవాడలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి పలు కీలక అంశాలపై చర్చించారు. గ్యాస్ వినియోగాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించాలని నిర్ణయించారు. ఒకవేళ గ్యాస్ ఇబ్బందులు ఎదురైతే హోటల్స్ మూసివేయాల్సి వస్తుందన్నారు.

వీక్లీ హాలిడే పేరుతో ప్రతి సోమవారం రెస్టారెంట్లను మూసివేస్తాము అంటున్నారు. ఏపీలో కూడా కర్ణాటక తరహా పరిస్థితులు వస్తాయంటున్నారు. అంతేకాదు ప్రభుత్వం రెస్టారెంట్లు, స్ట్రీట్‌ ఫుడ్‌ సెంటర్లు రాత్రి పది గంటల వరకే నడిపేలా ప్రభుత్వం ఆదేశించాలని కోరుతున్నారు. ప్రభుత్వం అతిథ్య రంగంపై ఆధారపడిన వేల మంది కార్మికులు రోడ్డున పడకుండా చూడాలని హోటల్స్ యజమానుల సంఘం కోరింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments