
-గుంజపడుగు రోడ్డుపై మారని దుస్థితి.. ముక్కు మూసుకుని వెళ్తున్న జనం
-పరిష్కారం అడిగితే “లం కొడుకులకు బుద్ధి ఉండాలి” అంటూ కార్యదర్శి వీరంగం
-“ఏం చేయాలో మీరే చెప్పండి” అంటూ రిపోర్టర్‌కే ఎదురు ప్రశ్నలు
జగిత్యాల జిల్ల, క్రైమ్ మిర్రర్:- గొల్లపల్లి మండల కేంద్రం నుండి గుంజపడుగు వెళ్లే ప్రధాన రహదారి డంపింగ్ యార్డును తలపిస్తోంది. గత కొద్ది రోజులుగా రోడ్డుకి ఇరువైపులా ప్లాస్టిక్ వ్యర్థాలు, హోటల్ చెత్త పేరుకుపోవడంతో అటుగా వెళ్లే వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై ప్రశ్నించిన మీడియా ప్రతినిధిపై గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రవర్తించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశమైంది. అధికారి నోటి దురుసు…
చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరగా.. కార్యదర్శి రాజిరెడ్డి తీవ్ర అసహనానికి లోనయ్యారు. తన బాధ్యతను విస్మరించి, ప్రజలను ఉద్దేశించి “నేను ఎన్నిసార్లు చెప్పించినా.. వేసే లం కొడుకులకు బుద్ధి ఉండాలి”** అంటూ పరుష పదజాలంతో దూషించడం విస్మయం కలిగించింది. ఒక ప్రభుత్వ బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ప్రజలను బూతులు తిట్టడంపై స్థానికులు మండిపడుతున్నారు.
Read also : అందరి దర్శకులందు అనిల్ రావిపూడి వేరయ్య?
చేతులు ఎత్తేసిన యంత్రాంగం:చెత్త వేస్తున్నది ప్రధానంగా హోటళ్లు, ప్లాస్టిక్ షాపుల నిర్వాహకులేనని తెలిసినా.. వారిపై చర్యలు తీసుకోవడంలో పంచాయతీ యంత్రాంగం విఫలమైంది. గతంలో తూతూమంత్రంగా చెత్త తొలగించి చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు మళ్లీ రోడ్డు చెత్తమయంగా మారడంతో, పరిష్కారం గురించి అడగ్గా.. “ఫ్లెక్సీలు పెట్టినా చింపేస్తున్నారు, ఇంకేం చేయాలో మీరే చెప్పండి” అంటూ విలేకరినే ఎదురు ప్రశ్నించడం అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది.
చర్యలు శూన్యం: రోడ్డు పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు, డీపీవో (DPO) స్పందించి, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తూ, ప్రజలను దూషించిన కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని, గుంజపడుగు రోడ్డును వెంటనే శుభ్రపరచాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Read also : అందరి దర్శకులందు అనిల్ రావిపూడి వేరయ్య?





