జాతీయం

బిగ్ బాస్ లో ఇద్దరికీ ఝలక్ ఇచ్చిన గంగవ్వ...

బిగ్ బాస్ సీజన్ 8 సెప్టెంబర్ ఒకటో తారీఖున ప్రారంభమై ఎప్పటికి అయిదు వారాలను పూర్తి చేసుకుంది. ప్రతి సంవత్సరం లా కాకుండా ఈ సంవత్సరం సరికొత్త ఎంటర్టైన్మెంట్ అనే టాగ్ లైన్ తో హోస్ట్ నాగార్జున ముందుకు తీసుకొచ్చాడు. నాగార్జున చెప్పినట్లు బిగ్బాస్ సీజన్ 8 అనేది అసలు లేదు. ఎందుకంటే ఈ సంవత్సరం హౌస్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చెప్పబడ్డారు. అయితే ఇప్పటికీ ఐదు వారాల్లో ఆరుగురు ఎలిమినేట్ కాగా ఇప్పుడు మరో 8 మంది వైల్డ్ కార్డు ద్వారా కంటెస్టెన్షన్ తీసుకువచ్చి అందరికీ కూడా షాక్ కి గురి చేశాడు హోస్ట్ నాగార్జున.

నిన్న ఆదివారం జరిగినటువంటి బిగ్ బాస్ షోలో హరితేజ, టేస్టీ తేజ, నైని పావని, గంగవ్వ, మెహబూబా, గౌతమ్, రోహిణి ఈ ఎనిమిది మందిని వైల్డ్ కార్డు ద్వారా తీసుకువచ్చారు. ఇందులో విశేషమేంటంటే వీరందరూ కూడా ఇంతకుముందు గత ఎనిమిది సీజన్లో కూడా ఏదో ఒక సీజన్లో వీళ్ళు ఉన్నవారే. అయితే ఇప్పుడు హౌస్ లో ఉన్నవారు కొత్తవారు వస్తారులే సులభంగా వాళ్ళని నామినేట్ చేస్తూ బయటికి పంపించొచ్చులే అని అందరూ అనుకున్నారు. కానీ అంత సులభం కాదని అర్థమైంది. ప్రస్తుతం వచ్చిన వాళ్ళలో గంగవ్వ ఇద్దరు కంటెస్టెంట్లని నామినేట్ చేస్తూ ఒక ఆట ఆడుకున్న తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ కూడా కరెక్ట్ చెప్తున్నావని గంగవ్వ పై ప్రశంసలు కురిపించారు.

Read More : దుర్గమ్మ ఆశీస్సులతో ప్రభాస్ కి పెళ్లి.. శ్యామలాదేవి

హౌస్ లోకి అడుగుపెట్టిన గంగవ్వ ఎవరైన ఇద్దరిని నామినేషన్ చేయాల్సిందిగా బిగ్ బాస్ కోరాడు. అయితే గంగవ్వ అందుకు తగ్గట్టుగానే విష్ణుప్రియ అలాగే మణికంఠ పై నామినేషన్ వేసింది. ఫస్ట్ విష్ణు ప్రియ ని నామినేట్ చేస్తూ నువ్వు బాగానే ఉన్నావు కదా గేమ్స్ ఆడటానికి ఏంటి నీకు ఇబ్బంది అని విష్ణు ప్రియ పై గంగవ్వ ఫైర్ అయింది. ఫస్ట్ రెండు వారాలు బాగానే ఆడావు. ఇప్పుడు ఏమైంది ఆడడానికి అని విష్ణు ప్రియ ని నామినేట్ చేస్తూ ఆ మాటలు చెప్పింది. ఇక మణికంఠణి నామినేట్ చేస్తూ నువ్వు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి పెళ్ళాం పిల్లలు గుర్తుకు వస్తున్నారని ఏడుస్తావ్ ఎందుకు అని ఫైర్ అయింది. అంతలా వాళ్లు గుర్తుకొస్తుంటే నువ్వు బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు వచ్చావు ఇంట్లోనే ఉండొచ్చు కదా అని మణికంఠ మొఖం మీద చెప్పడంతో అందరూ కూడా అవాక్కయ్యారు. అయితే గంగవ్వ చెప్పిన దాంట్లో 100% నిజం ఉందని అందరూ కూడా గంగవ్వని మెచ్చుకుంటున్నారు. నాలుగో సీజన్లో గంగవ్వ వచ్చి మధ్యలోనే అనారోగ్యంతో బయటికి వెళ్లిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం హౌస్ లోకి అడుగుపెట్టి అందరిని కూడా ఒక ఆట ఆడుకుంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button