తెలంగాణ

అక్రమ గంజాయి రవాణా చేస్తున్న ముఠా అరెస్ట్

క్రైమ్ మిర్రర్, మాడుగులపల్లి:- బీహార్ రాష్ట్రం నుంచి గంజాయిని తీసుకొచ్చి మాడుగుల పల్లి మండలం పరిధిలోని గ్రామాలలో యువకులకు అలవాటు చేసి అమ్ముతున్న పదిమందిని అరెస్టు చేసినట్లు మిర్యాలగూడ డిఎస్పి కె. రాజశేఖర్ రాజు తెలిపారు.. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ పోలీస్ స్టేషన్లో డి.ఎస్.పి రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు.. బీహార్ రాష్ట్రం ఫుడ్ కి చౌక్. గోగిరి తానాకు చెందిన రాజకుమార్ పటేల్, సికిందర్, మిర్యాలగూడ సీతారాంపురం కు చెందిన సమీర్ వద్ద నుంచి గంజాయి మరియు మాదకద్రవ్యాలను కొనుగోలు చేసి మిర్యాలగూడ మరియు మాడుగులపల్లి గ్రామ పరిసర ప్రాంతాలకు చెందిన యువకులకు అధిక ధరలకు అమ్ముతున్నారు. ఈ క్రమంలోనే వీరికి గంజాయి అలవాటు ఉన్న మాడుగులపల్లికి చెందిన కొందరు వ్యక్తులు పరిచయం కాగా వారికి కూడా గంజాయిని బీహార్ రాష్ట్రం నుండి తీసుకొని వచ్చి అమ్ముతున్నారు. వారి నుండి మాడుగులపల్లి మండలం పూసలపహాడ్ గ్రామానికి చెందిన కొండేటి యశ్వంత్ అలియాస్ చింటూ ను పరిచయం చేసుకొని మాడుగులపల్లి పరిసర గ్రామాల యువకులకు గంజాయిని అధిక ధరలకు అమ్ముతున్నారు అని తెలిపారు..

ఎలా పట్టుకున్నారు..?

ఈనెల 25వ తారీకు నాడు రాజకుమార్ పటేల్ మరియు కొండేటి యశ్వంత్ లు గంజాయిని కోడెల శివ, బొల్లంపల్లి విష్ణు, బుర్రి లోకేష్, వంశీ, దైద సందీప్, పందిరి చరణ్ తేజ, మిరియాల వివేకానందారెడ్డి, బుర్రి నవీన్ లకు అమ్మడానికి కొండేటి యశ్వంత్ అలియాస్ చింటూ తన ద్విచక్ర వాహనంపై మాడుగులపల్లి వద్ద ఉన్న పాత రైల్వే కోటర్స్ వద్ద గంజాయిని మరియు గంజాయి చాక్లెట్లను అందిస్తున్నాడు అని విశ్వసనీయమైన సమాచారం మేరకు మాడుగుల పల్లి పోలీస్ వారు వారిని పట్టుబడి చేసి వారి వద్ద నుండి 1350 గ్రాముల గంజాయి 22 గంజాయి చాక్లెట్లను, 8 సెల్ ఫోన్స్, మూడు మోటార్ సైకిలను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు.. వారిలో బీహార్ రాష్ట్రం కి చెందిన సికిందర్ మరియు మిర్యాలగూడకు చెందిన షేక్ సమీర్ పరారీలో ఉన్నారన్నారు. మిగతా పది మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనైందని తెలిపారు…

నేరస్తుల వివరాలు ఇలా ఉన్నాయి..?

1. కొండేటి యశ్వంత్ (21) తండ్రి గురువయ్య, ల్యాబ్ టెక్నీషియన్, మాడుగులపల్లి మండలం, పూసలపహాడ్ గ్రామం.
2. కోడెల శివ (23) తండ్రి వెంకటయ్య, మాడుగులపల్లి మండలం, పూసలపహాడ్ గ్రామం.
3. బొల్లంపల్లి విష్ణు(20) తండ్రి సైదులు, మాడుగులపల్లి మండలం, పూసలపహాడ్ గ్రామం.
4. బుర్రి లోకేష్ (20) తండ్రి రామలింగయ్య, మాడుగులపల్లి మండలం, దాచారం గ్రామం.
5. దైద సందీప్(24) తండ్రి శ్రీను, మాడుగులపల్లి మండలం, పూసలపహాడ్ గ్రామం.
6. గుండెబోయిన వంశీ(25) తండ్రి జానయ్య, మాడుగులపల్లి మండలం, పూసలపహాడ్ గ్రామం.
7. పందిరి చరణ్ తేజ్ (18), మాడుగులపల్లి మండలం, ఇందుగుల గ్రామం.
8. మిర్యాల వివేకానందారెడ్డి (29) తండ్రి కరుణాకర్ రెడ్డి, మాడుగులపల్లి మండలం, ఇందుగుల గ్రామం.
9. బుర్ర నవీన్ (24) తండ్రి మల్లయ్య, మాడుగులపల్లి మండలం, దాచారం గ్రామం.
10. రాజ్ కుమార్ పటేల్ (36) తండ్రి బలేసార్ పటేల్, బీహార్ రాష్ట్రం
ఇట్టి కేసును సేదించిన మిర్యాలగూడ రూరల్ సీఐ పి ఎన్ డి ప్రసాద్, మాడుగులపల్లి ఎస్ఐ ఎస్ కృష్ణయ్య, ఏఎస్ఐ లు నరసింహారావు, జాఫర్, వెంకటేశ్వర్లు, హెడ్ కానిస్టేబుల్ సిహెచ్ శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్స్ ఎస్. సైదులు, ఎం. సైదిరెడ్డి, పి. అనిల్, ఎస్. ఆంజనేయులు, వై. యాదయ్య, జి. నరేష్, బి. సైదులు, వి. శ్రీను నాయక్, డ్రైవర్ సురేష్ లను మిర్యాలగూడ డిఎస్పి అభినందించారు.

Read also: ఉత్తరాదిన కుంభవృష్ఠి

Read also : రెండు రోజులు భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button