
హైదరాబాద్ జీడిమెట్ల పరిధిలో అత్యంత దారుణ ఘటన జరిగింది. గాజుల రామారంలో కొబ్బరిబొండాల కత్తితో ఇద్దరు కొడుకులను నరికి చంపింది కసాయి తల్లి. అనంతరం భవనం పై నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. 6 పేజిల సూసైడ్ నోట్ రాసి ఇద్దరు కొడుకులు అర్షిత్ రెడ్డి, ఆశిష్ రెడ్డిలను కొబ్బరిబొండాల కత్తితో నరికి అనంతరం 5 ఫ్లోర్ల అపార్ట్‌మెంట్ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్న తల్లి తేజస్విని. చిన్నకొడుకు ఆశిష్ రెడ్డిని షాపూర్ నగర్లోని రామ్రాజ్ ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు. ఈ ఘటన సంచలనంగా మారింది.
అయితే పోలీసుల విచారణలో కన్నబిడ్డలను తల్లి కిరితకంగా చంపడంపై సంచలన విషయాలు వెలుగులోనికి వచ్చాయి. ముందు నుండి తల్లి తేజస్విని(32)కి కళ్లసమస్య ఉంది. అదే సమస్య ఇద్దరు పిల్లలకు రావడం ప్రతి 4 గంటలకు ఒకసారి కళ్లల్లో డ్రాప్స్ వేస్తే కాని కనబడని సమస్యతో సతమతమవుతున్నారు.చాల ఏళ్లనుండి ఈ సమస్యతో పోరాడుతు చచ్చి బ్రతుకుతున్న పరిస్థితియ దీంతో ఇంట్లో ఎప్పుడు గొడవలు జరుగుతున్నాయి. భర్త కూడా కోపంతో చస్తే చావండి అంటూ గొడవకు దిగుతాడని.. దీంతోనే పిల్లలను చంపి తాను సూసైడ్ చేసుకుంటున్నట్టు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న తేజస్విని.
ఇవి కూడా చదవండి ..
-
తెలంగాణలో ఫ్రూట్ జ్యూస్ తరహాలో టెట్రా ప్యాకెట్లలో మద్యం.
-
మర్రిగూడ ఎంపిడివో రాజకీయం..!రాజకీయంగా మారిన కరువు పని?
-
కూటమిలో కరివేపాకులా బీజేపీ – అరకొర పోస్టులపై అసంతృప్తి..!
-
కోమటిరెడ్డిపై గుత్తా తిరుగుబాటు.. రెండుగా చీలిన నల్గొండ కాంగ్రెస్?
-
ఆస్తి కోసం కూతురును చంపి సవతి తల్లి.. నదిలో పాతి పెట్టిన వైనం!..