క్రైమ్జాతీయం

ఇకపై మూవీ పైరసీ చేస్తే మూడేళ్లు జైలు శిక్ష!..

క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్ :- ఈమధ్య మూవీ పైరసీ అనే భూతం యావత్ భారత దేశమంతా కూడా వ్యాపించింది. చాలా సినిమాలు విడుదలైన రోజే పైరసీకి గురవడం ఒకవైపు సినిమా ఇండస్ట్రీని మరోవైపు ప్రొడ్యూసర్లను కలవరపెడుతుంది. ఈ మూవీ పైరసీ జరగడం వల్ల ఎన్నో కోట్లు నష్టాలను నిర్మాతలకు తెచ్చిపెట్టేది. దీని కారణంగా ఈ పైరసీభూతాన్ని అరికట్టేందుకు కేంద్రం సరికొత్త చర్యలను చేపట్టింది. సినిమాటోగ్రాఫ్ చట్టాన్ని సవరిస్తూ కేంద్రం నేడు ఈ కీలక నిర్ణయం తీసుకుంది. చట్ట విరుద్ధంగా ఎవరైనా కూడా చిత్రాలను రికార్డు చేయడం అలాగే ప్రసారం చేస్తున్న వారిపై మూడేళ్ల జైలు శిక్ష పడుతుంది అని.. కేంద్రం హెచ్చరించింది. అలాగే నిర్మాణ వ్యాయంలో 5% వరకు జరిమానా కూడా కట్టాల్సి ఉంటుందని కీలక హెచ్చరికలు జారీ చేసింది.


Also Read : కన్న కొడుకు చేతిలో వృద్ధ తల్లిదండ్రుల కన్నీటి గాధ.!


కాగా గతంలో ఈ పైరసీ నేరాలకు మూడు నెలల పాటు జైలు శిక్ష విధించేవారు. అలాగే మూడు లక్షల రూపాయల జరిమానా విధించేవారు. అయినా కూడా ఈ పైరసీని ఆపకుండా కంటిన్యూ చేస్తున్నందుకు… తీవ్ర ఆగ్రహానికి గురైన కేంద్రం నేడు సరికొత్త చర్యలు చేపట్టింది. దీంతో ఇకపై ఎవరైనా సినిమాలను రికార్డ్ చేసిన లేదా విడుదలైన రోజే పలు వెబ్సైట్లో విడుదల చేయడం లాంటివి చేస్తే చట్టపరంగా శిక్షలు తప్పవు అని.. కేంద్రం సరికొత్త నిర్ణయం తీసుకుంది. కాగా ఈమధ్య తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చాలా సినిమాలు పైరసీకి గురయ్యాయి. ఎన్నో రకాలుగా… శతవిధాల కష్టపడి.. ఎన్ని కోట్లు పెట్టి సినిమాను తీస్తుంటే ఇలా ఒక రోజులోనే వాటన్నిటికీ… పైరసీ ద్వారా పుల్ స్టాప్ పెడుతున్నారని కొంతమంది నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో సినిమాలు పైరసీకి గురైన.. ఇప్పటివరకు ఏ ఒక్కరు కూడా బయట పడలేదు.

Also Read : వరుస దొంగతనాలు… ఒంగోలు ప్రజల గుండెల్లో భయం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button