
క్రైమర్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రంలో మరో కొత్త పథకం త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ పథకం పిల్లల కోసం అని.. రాష్ట్రవ్యాప్తంగా ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు ఏ ఆరోగ్య సమస్య ఉన్న కూడా ‘బాల భరోసా’ అనే పథకం ద్వారా ఉచిత చికిత్స అందించాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. ఇక త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభిస్తారని సమాచారం. జీరో నుంచి ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు ప్రతి ఒక్క ఆరోగ్యపు విషయంపై ఏకంగా 42 అంశాలపై ఇంటింటా సర్వే చేశారు. అంగన్వాడీ, పిల్లల వినికిడి శక్తి, కంటి చూపు, ఇతర ఆరోగ్య సమస్యలు వంటివి దాదాపు 42 అంశాలపై ఇంటింటా సర్వే చేసి 18 లక్షల మంది డేటా సేకరించగా.. దాదాపు అందులో ఎనిమిది లక్షల మంది చిన్నపిల్లలు ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నట్లుగా తేలడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి బాల భరోసా అనే త్వరలో ప్రారంభించబోయే కొత్త పథకం ద్వారా ఉచిత చికిత్సతో ఈ సమస్యలన్నీ కూడా మాయం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా సమాచారం. ఈ పథకం కనుక రాష్ట్రంలో ప్రారంభిస్తే ఇక చిన్న పిల్లల సమస్యలు మటుమాయమే. ఎందుకంటే ప్రస్తుత కాలంలో ఐదు సంవత్సరాలలోపు పిల్లలు కూడా ఎంతోమంది అనారోగ్య సమస్యలతో ఉన్నారు. కాబట్టి వారందరికీ కూడా ఈ పథకం ద్వారా ఉచిత చికిత్స అందిస్తే మాత్రం ప్రజలందరూ చాలా సంతోషంగా ఉంటారు.
Read also : నా దగ్గర ఉన్న వాచ్ ల విలువ 60 కోట్లు.. కానీ నాకు అదే ఇష్టం : హీరో ధనుష్
Read also : 48 గంటల్లో మరో తుఫాన్.. ఐదు రోజులపాటు భారీ వర్షాలు!





