నల్లగొండ, క్రైమ్ మిర్రర్: RKS ఫౌండేషన్ ఆధ్వర్యంలో నల్లగొండ 10వ డివిజన్ లో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు పిల్లి రామరాజు యాదవ్, 10 విడిజన్ కార్పొరేటర్ పిల్లి కృష్ణం రాజు యాదవ్ నేతృత్వంలో హైదరాబాద్ మలక్ పేట యశోద హాస్పిటల్ వైద్యుల బృందం ఈ హెల్త్ క్యాంప్ ను నిర్వహించింది. ప్రేరణ స్కూల్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కార్డియాలజిస్టు, గైనకాలజిస్టు, జనరల్ మెడిసిన్ నిపుణులు పాల్గొని ప్రజలను పరీక్షించారు. ఈ సందర్భంగా అవసరమైన వారికి ఉచితంగా ఔషధాలు పంపిణీ చేశారు.
ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే మెడికల్ క్యాంప్ ఏర్పాటు!
ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ మెగా హెల్త్ క్యాంప్ ను ఏర్పాటు చేసినట్లు RKS ఫౌండేషన్ నిర్వాహకులు పిల్లి రామరాజు, పిల్లి కృష్ణం రాజు వెల్లడించారు. ప్రజలు అనారోగ్య సమస్యలతో బాధపడకూడదనే ఉద్దేశంతో ఇప్పటికే నల్లగొండలు పలు మెగా హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయించినట్లు తెలిపారు. తాజాగా ప్రేరణ స్కూల్ లో మలక్ పేట యశోద ఆస్పత్రి సహకారంతో మరోసారి మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రజలకు గుండె జబ్బుల నుంచి మొదలుకొని అన్ని రకాల వైద్య పరీక్షలను ఉచితంగా అందించినట్లు చెప్పారు. ఈ హెల్త్ క్యాంప్ నకు సహకరించిన యశోద హాస్పిటల్ యాజమాన్యానికి, క్యాంపునకు వచ్చిన డాక్టర్ల బృందానికి, ఈ క్యాంప్ స్కూల్లో ఏర్పాటు చేసుకుంనేందుకు సహకరించిన ప్రేరణ స్కూల్ యాజమాన్యానికి, ఈ కార్యక్రమం సక్సెస్ కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి పిల్లి బ్రదర్స్ ధన్యవాదాలు చెప్పారు.
ఈ కార్యక్రమంలో పిల్లి రామరాజు యాదవ్, పిల్లి కృష్ణం రాజు యాదవ్ తో పాటు ప్రేరణ స్కూల్ ప్రిన్సిపల్ విష్ణువర్ధన్ రెడ్డి, బానోతు రవిందర్, గంగబోయిన వెంకన్న, వెంకటాచారి, నామా ప్రకాష్, పుల్లెంల మహేష్ గౌడ్, మామిడాల కృష్ణ, పెరికెటి వెంకటేశ్వర్లు, ఐతరాజు జానయ్య, జ్యోతి, సింగం రమేష్, యశోద డాక్టర్లు, ప్రేరణ స్కూల్ సిబ్బంది, పెద్ద సంఖ్యలో 10వ డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.
